మహానాడులో ఏమీ ఈ భజన

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu mahanadu meeting
Updated:  2018-05-30 06:21:52

మహానాడులో ఏమీ ఈ భజన

చంద్రబాబు నిర్వహించిన మహానాడును చూస్తూ ఉంటే సంక్రాంతి పండగకి వచ్చిన గంగిరెద్దుల్లా వుంది అని వైస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి ఎద్దేవా చేశారు. 3 కోట్లు ప్రజల సొమ్మును ఖర్చుపెట్టి ప్రజలకు పనికి వచ్చే ఒక్క మంచి నిర్ణయం అయినా తీసుకున్నారా అని ఆమె ప్రశ్నించారు. 
 
N-TDP అనగా ఎన్టీఆర్ (రామన్న) తెలుగుదేశం పార్టీ ని C-TDP అనగా (చంద్రన్న) కాంగ్రెస్ తెలుగుదేశం గా మార్చిన ఘనత చంద్రబాబుకె దక్కుతుందని ఆమె అన్నారు.ఈ రోజు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని చెప్పుకుంటున్నారని ఆమె గుర్తు చేశారు.. మహానాడు విషయానికి వస్తే ఎన్టీఆర్ ఏ ఆశయాలతో నైతే  పార్టీని స్థాపించారో అందుకు విరుద్ధంగా చంద్రబాబును పొగిడించుకునే ఒక భజన బ్యాండ్ మేళంగా, ఏడాదికి ఒకసారి సంక్రాంతికి వచ్ఛే గంగిరెద్దుల వారితో డబ్బులు ఇఛ్చి పొగిడించుకున్నట్లుగా వుంది తప్పితే ప్రజా సమస్యల గురించి, ఆచరణ గురించి ఏమైనా చర్చించారా అని ఆమె ప్రశ్నించారు. 
 
నర్సిరెడ్డి, దివాకరరెడ్డి లు జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన కుటుంబం గురించి మాట్లాడటం వింటుంటే చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుందని అర్థం అవుతుందని ఆమె అన్నారు. అక్కడవున్న తెలుగు తమ్ముళ్లు NTR కుర్చీని పార్టీ జెండాను నిర్ధక్ష్యంగా చంద్రబాబు లాక్కున్నప్పుడు కళ్ళముందు జరిగిన సంఘటనలు బాగా గుర్తుపెట్టుకున్నారని, చెడును ఇతరలపై మోపెది మీకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఈ సారి జగన్ మోహన్ రెడ్డి మరియు అయన కుటుంబం మీద బాగానే బురద చల్లాలని చూసారని కానీ ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితులలో లేరని ఆమె హెచ్చరించారు 
 
ప్రజల సమస్యలు పట్టించుకోనని  C-TDP తమ్ముళ్లు YS కుటుంభం గురించి ముఖ్యంగా విజయమ్మ, భారతమ్మ & షర్మిలమ్మల గురించి ఏమైనా తప్పుగా విమర్శిస్తున్నారు అంటే అది మీ ఇంట్లో మహిళలను విమర్శించడమే అని గుర్తుపెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.