బాబు చేతికి గాజులు తొడుక్కో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-14 13:13:11

బాబు చేతికి గాజులు తొడుక్కో

కర్నూలులో దారుణం.. పదహారేళ్ల బాలికపై...హత్యాచారం,అత్యాచారాలపై  దారుణాలు ఆగడంలేదు. కాగా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే బ్లాక్ డే ప్రకటించాలి అని వైస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి సూచించారు. 
 
తాజాగా కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. పదహారేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానిక పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కామాంధుడిని నిలదీశారు. కాగా తండ్రి చేసిన ఘాతుకాన్ని కొడుకు సమర్ధించాడు. నిన్న దాచేపల్లి మొన్న గుంటూరు అందుకు ముందు దాచేపల్లి ఇలాచెప్పుకుంటూ పోతే లెక్క పెట్టలేనన్ని ఉండటం మన రాష్ట్రం చేసుకున్న దౌర్బాగ్యం అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు...
 
రాబొయ్యే రోజుల్లో బ్లాక్ డే బదులు గుడ్ డే ఎక్కడ అని వెతుక్కోవాల్సి వస్తుంది అని ఆమె అన్నారు అనగా ప్రతిరోజు ఒక బ్లాక్ డే గా చంద్రబాబు పాలనా వున్నది  అని ఆమె గుర్తు చేసారు. ఇంత జరుగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఏమి పట్టనట్లు ప్రచారానికి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి చేతులు దులుపుకొని విధానం చాల అభ్యంతకరంగా వుంది అని మహిళలు అంటే చిన్న చూపు చూసే చంద్రబాబు మహిళలకు రక్షణ ఇవ్వ లేక చేతగాని వారిలా చేతికి గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోవలసిందిగా సూచించారు. అంతేకాక రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన చంద్రబాబు రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేసారు శైలజ చరణ్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.