టీడీపీలో చేరిక‌పై శైల‌జానాథ్ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-18 18:03:41

టీడీపీలో చేరిక‌పై శైల‌జానాథ్ క్లారిటీ

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయంటే రాజ‌కీయ నాయకులు ఇత‌ర పార్టీల్లోకి జంప్ చెయ్య‌డం స‌ర్వ‌సాధార‌ణం తెర‌వెనుక త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం పార్టీ మారుతున్నా మీడియా ముందు మాత్రం క‌టింగ్ లు ఇస్తూ తాను అభివృద్ది కోస‌మే పార్టీ మారుతున్నామ‌ని కొంద‌రు అంటే మ‌రికొంద‌రేమో త‌న‌కు పార్టీలో మ‌ర్యాద లేద‌ని చెప్పి ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తుంటారు. 
 
ఏది ఏమైనా పార్టీ మార‌డం మాత్రం ఖాయం. అలా అభివృద్ది పేరు చెప్పి గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసిన వారు కో కొల్ల‌లు. తాము ప్ర‌తిప‌క్షంలో ఉంటే అభివృద్ది చేయ‌లేమ‌న్న వీరు అధికార పార్టీలోకి ఫిరాయించిన త‌ర్వాత ఎంత మేర‌కు అభివృద్ది చేశారో ఈ ప్ర‌శ్న‌కు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కే తెలియాలి. 
 
ఇక ఇదే క్ర‌మంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శైల‌జ‌నాథ్, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకోస‌మే ఆయ‌న ఈ రోజు సెక్ర‌టేరియ‌ట్ లో చంద్ర‌బాబుని క‌లిశారని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.  
 
ఇక ఈ వార్త‌లపై వెంట‌నే స్పందించారు మాజీ మంత్రి, తాను ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ను వీడ‌న‌ని స్ప‌ష్టం చేశారు. ఈ రోజు కేవ‌లం చంద్ర‌బాబుని ప‌లు స‌మ‌స్య‌ల‌పై క‌లిశాన‌ని శైల‌జానాథ్ స్ఫ‌ష్టం చేశారు. త‌మ‌కు రావాల్సిన పింఛ‌న్లు వైద్య స‌దుపాయాల‌కు సంబందించి పెట్టిన బిల్లును తిర‌స్క‌రిస్తున్న‌ట్లు వ‌చ్చిన ఎస్‌.ఎం.ఎస్ చంద్ర‌బాబుకు చూపించామ‌ని ఆయ‌న తెలిపారు. తాను ఈ విష‌యం గురించే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును అలాగే అసెంబ్లీ స్పీక‌ర్ కొడెల శివ‌ప్ర‌సాద్ ను ను క‌లిశాన‌ని ఆయ‌న అన్నారు. అంతే కాదు 2019 సార్వత్రిక‌ ఎన్నిక‌ల్లో తాను ఖ‌చ్చితంగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.