వైయ‌స్ భార‌తి పిలుపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-11 12:08:15

వైయ‌స్ భార‌తి పిలుపు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి వైయ‌స్ భార‌తి సాక్షి సంస్ధ‌కు చైర్ ప‌ర్స‌న్ గా కొన‌సాగుతున్న విష‌యం అంద‌రికీ తెలుసు. జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం రోజున క‌డ‌ప‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌తో భార‌తి  త్వ‌ర‌లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రానుందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. 
 
అయితే, భార‌తి మాత్రం మీడియా వేదిక‌గా  తెలుగు ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  ఇందులో భాగంగానే మహిళాభ్యున్నతికి నేనుశ‌క్తి అనే ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. నేటి నుండి సాక్షిలో   నేను శ‌క్తి కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం కానున్నాయి. 
 
మ‌హిళ‌ల అణ‌చివేత‌తో పాటు వారి చుట్టు ఉన్న స‌మ‌స్య‌లను, ప‌రిష్కారాల‌ను పాఠ‌కుల ముందుకు ఉంచేందుకు ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాం...ముఖ్యంగా లింగ వివక్ష,గృహ హింస,వేధింపులు,సాధికారతపై క‌లిసి  ఉద్యమిద్దాం. లక్ష్యాలను సాధిద్దాం రండి అంటూ వైయ‌స్ య‌స్ భార‌తి పిలుపునిచ్చారు. మ‌రిన్ని వివ‌రాల‌కు సాక్షి పేప‌ర్ చూడ‌గ‌ల‌రు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.