రాజీనామా చేస్తా....వైకాపా ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-17 06:09:58

రాజీనామా చేస్తా....వైకాపా ఎమ్మెల్యే

వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు  రాజీనామా  చేసేందుకు సిద్ద‌మంటూ ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  ప్ర‌త్యేక హోదా ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. హోదా కోసం త‌మ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే.
 
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశిస్తే తాము కూడా శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసేందుకు సిద్ద‌మంటూ సాలూరు ఎమ్మెల్యే రాజ‌న్నదొర ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ పార్టీ మొద‌టి నుండి హోదా కోసం  పోరాటం చేస్తోంద‌ని, త‌మ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ హొదా కోసం నిరాహార దీక్ష‌లు, యువ‌భేరి కార్య‌క్ర‌మాలు చేశార‌ని  రాజ‌న్న దొర గుర్తు చేశారు. 
 
కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  మంత్రి అశోక్  గ‌జ‌ప‌తి రాజు  బడ్జెట్ ను అధ్య‌యనం చేయవలసి ఉందని పేర్కోవ‌డం శోచనీయ‌మ‌న్నారు. తమ ఎంపీల‌తో పాటు తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్దమని ఆయన ప్ర‌క‌ట‌న చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.