జ‌గ‌న్ స‌మ‌క్షంలో కీల‌క నేత వైసీపీ తీర్థం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-20 11:29:15

జ‌గ‌న్ స‌మ‌క్షంలో కీల‌క నేత వైసీపీ తీర్థం

2019 ఎన్నికలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఇటు రాకీయ నాయ‌కుల‌తో పాటు అటు వ్యాపారానికి చెందిన కీల‌క నాయ‌కులు కూడా ప్ర‌తిపక్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు. వ్యాపార పరంగానే కాకుండా రాజ‌కీయంగా ఓ వెలుగు వెల‌గాల‌నే ఉద్దేశంతో వారు వైసీపీ కండువా క‌ప్పుకుంటున్నారు. అయితే ఇదే క్ర‌మంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర జ‌న‌ర‌ల్ మార్కెట్ చైర్మ‌న్, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ మాజీ అధ్యక్షుడు సందెపు శ్రీనివాస్ వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
పార్టీలో చేరేందుకు వ‌చ్చిన సందెపును జ‌గ‌న్ స‌గ‌ర్వంగా  పార్టీలోకి ఆహ్వానించారు. ఆ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రి చేసేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌ని చెప్పారు. అంతేకాదు ప్ర‌స్తుతం అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌పై కూడా సందె నిప్పులు చెరిగారు. 2014లో అనేక హామీలను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కులు ఒక్క హామీని కూడా అమ‌లు చేయ‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కులు నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల కాలంలో టీడీపీ నాయ‌క‌లు అభివృద్ది చెందారు కానీ రాష్ట్ర ప్ర‌జ‌లు అభివృద్ది చెంద‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌జ‌లు బాగు ప‌డాల‌న్నా, ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందాల‌న్నా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితేనే అవి సాధ్యం అవుతాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.