అమ్మ‌వారిమీద ఒట్టేసి చెబుతున్నా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-10-11 12:17:46

అమ్మ‌వారిమీద ఒట్టేసి చెబుతున్నా

ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ తాజాగా న‌గ‌రంలో ఉన్న మ‌హాల‌క్ష్మీ అమ్మవారి దేవాల‌యంలో ప్ర‌మాణం చేసి అధికార తెలుగుదేశం పార్టీ మంత్రి నారాయ‌ణకి అలాగే టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి స‌వాల్ విసిరారు. కొద్దిరోజులుగా జిల్లాలో హౌస్ ఫ‌ర్ ఆల్ స్కీమ్ అక్ర‌మాల వ్య‌వ‌హారంలో ఎమ్మెల్యే అనిల్ హ‌స్తం ఉంద‌ని, అలాగే హైద‌రాబాద్ పార్క హ‌యాత్ హోట‌ల్లో ఒక కాంట్రాక్ట్ ను బెదించార‌నే ఉద్దేశంతో అనేక సంద‌ర్భాల్లో టీడీపీ నాయ‌కులు మీడియాను వేదిక‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 
 
అయితే తాజాగా వారు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ స్పందించారు. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని త‌న‌పై టీడీపీ నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వ‌మ‌ని అమ్మ‌వారి సాక్షిగా ప్ర‌మాణం చేశారు అనిల్. తాను ఆస్తులు అమ్ముకుంటు బ్యాంకుల్లో లోన్ తీసుకుంటు రాజ‌కీయాలు చేయ‌డం లేద‌ని, ఏ ఒక్క‌రిని బెదిరించి ఒక్క‌రూపాయి కూడా తీసుకోలేద‌ని ప్ర‌మాణం చేశారు. 
 
ఇదంతా టీడీపీ నాయ‌కులు త‌న‌కు ప్ర‌జ‌లు తెలుపున్న మ‌ద్ద‌తును చూసి స‌హించ‌లేక ఇలాంటి అవాస్త‌వమైన వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే పేద‌ల‌కు నిర్మించే ఇళ్ల విష‌యంలో గతంలో టీడీపీ మంత్రి నారాయ‌ణ కోటంరెడ్డిలు అవినీతికి పాల్పడ్డారంటు చేసిన వ్యాఖ్య‌ల‌కు తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని అన్నారు. ఇళ్ల నిర్మాణ విష‌యంలో వారి లాగా అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని అయితే వారిద్ద‌రు ప్ర‌జాస‌మ‌క్షంలో అమ్మ‌వారి సాక్షిగా ప్ర‌మాణం చెయ్యాల‌ని అనిల్ స‌వాల్ విసిరారు. 
 
అధికార బలంతో మంత్రి నారాయ‌ణ దొంగ ర్యాంకుల‌ను కొంటూ, దొంగ ర్యాంకుల‌ను సృష్టిస్తూ రాష్ట్రంలో ఉన్న పిల్ల‌ల తంల్లిదండ్రుల‌ను మోసం చేస్తున్నార‌ని అనికుమార్ యాద‌వ్ మండిప‌డ్డారు. తాను చేస్తున్నా విమ‌ర్శ‌లు నిజం కాక‌పోతే వీరిద్ద‌రు అమ్మ‌వారి ముద్దు ప్ర‌మాణం చెయ్యాల‌ని అన్నారు. అయితే అనిల్ చేసిన విమ‌ర్శ‌ల‌కు టీడీపీ నాయ‌కులు మీడియా ముందు స్పందిస్తున్నారు త‌ప్ప అమ్మావారి మీద ప్ర‌మాణం మాత్రం చేయ‌కున్నారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.