క‌ర్నూల్ జిల్లాలో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-28 15:16:00

క‌ర్నూల్ జిల్లాలో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఫిక్స్

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీలో మొద‌టి సారిగా 2014లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో రాయ‌లసీమ‌లోని మూడు జిల్లాలు వైసీపీకి కంచుకోట‌గా వ్య‌వ‌హ‌రించాయి. అందులో ఒక‌టైన జిల్లా క‌ర్నూల్ జిల్లా. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, అలాగే రెండు పార్ల‌మెంట్ స్థానాలు ఉన్నాయి.అయితే గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ14 అసెంబ్లీ స్థానాల‌కు గాను 11 స్థానాల్లో కైవ‌సం చేసుకుంది. మిగిలిన 3 స్థానాల్లో టీడీపీ నెగ్గుకొచ్చింది. ఇక రెండు పార్ల‌మెంట్ స్థానాల‌ను కూడా వైసీపీనే కైవ‌సం చేసుకుంది. 
 
అయితే ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ జిల్లానుంచి ఐదుమంది ఎమ్మెల్యేలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. అంతేకాదు రాజ్యాంగానికి విరుద్దంగా మంత్రి ప‌ద‌వి కూడా పొంది మ‌రో రికార్డ్ ను సృష్టించారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు.
 
ఇక వారు టీడీపీలోకి ఫిరాయించిన‌ప్ప‌టి నుంచి క‌ర్నూల్, నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌, శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ పరిణామాల‌పై రోజుకొక వార్త వ‌చ్చేది. ఇక తాజాగా ఈ లిస్టులోకి పాణ్యం నియోజ‌క‌వ‌ర్గం చేరింది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో పాణ్యంలో కొద్దికాలం నుంచి వైసీపీలో సీట్ల ర‌గ‌డ తారా స్థాయికి చేరుకుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. 
 
మ‌రో వైపు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ త‌ర‌పుర ఎవ‌రిని బ‌రిలోకి దించితే వారికి త‌గిన వ్య‌క్తిని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కూడా బ‌రిలోకి దించే ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే కు ఛాన్స్ ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నీటి స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంది. 
 
వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా పాణ్యంలో నీటి స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యే గౌరుచ‌రితా రెడ్డి ఎమ్మెల్యే ఫండ్స్ వ‌చ్చే వ‌ర‌కూ ఆశించ‌కుండా త‌న సొంత వ్య‌యం వెచ్చించి ప్ర‌జ‌ల‌కు నీటి అవ‌స‌రాల‌ను తీర్చుతున్నారు. దీంతో ఈమెకు ప్ర‌జాధ‌ర‌ణ‌ ఎక్కువ వ‌స్తోంది, దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా గౌరుచ‌రితారెడ్డిని మ‌ళ్లీ పోటీ చేయించేదుకు జ‌గ‌న్ సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇక తాజాగా బీజేపీకి చెందిన కాట‌సాని రాంభూపాల్ రెడ్డి కూడా పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున బ‌రిలో దిగేది సిట్టింగ్ ఎమ్మెల్యేనా లేక కాట‌సాని రాంభూపాల్ రెడ్డి బ‌రిలోకి దిగుతారా అన్న‌ది కొద్దికాలంగా ఆస‌క్తిక‌రంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే కాట‌సాని మాత్రం జ‌గ‌న్ కోరిక మేర‌కు తాను పార్టీలో కొన‌సాగుతార‌ని చెప్పారు. 
 
దీంతో ఆయ‌న‌కు 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గౌరుచ‌రితారెడ్డిని బ‌రిలో దించుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక మ‌రోవైపు గౌరుకు వ్య‌తిరేకంగా బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి టీడీపీ త‌ర‌పున పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. ఎందుకంటే బైరెడ్డి నియోజ‌వ‌ర్గం అయిన నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వుడు కావ‌డంతో భైరెడ్డి పాణ్యం వైపు మ‌కాం వేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ విష‌యంపై టీడీపీ పాణ్యం ఇంచార్జ్ ఇందుకు సుముఖంగా వ్య‌వ‌హ‌రిస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.