గిడ్డి ఈశ్వ‌రి సీటు గ‌ల్లంతు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu and giddi eswari
Updated:  2018-11-05 12:56:24

గిడ్డి ఈశ్వ‌రి సీటు గ‌ల్లంతు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడు, త‌ల్లి కాంగ్రెస్ తో ఇటీవ‌లే హ‌స్తిన సాక్షిగా పొత్తు కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాస్త పుంజుకుంటుంద‌ని భావిస్తునే మ‌రో వైపు వారు పోటీ చేసే స్థానాల‌ను కూడా ఫిక్స్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే చంద్ర‌బాబు నాయుడు మాత్రం  25 అసెంబ్లీ స్థానాల‌ను 5 పార్ల‌మెంట్ స్థానాల‌కు కేటాయిస్తామ‌ని తెలిపిన‌ట్లు తెలుస్తోంది.
 
ఈ క్ర‌మంలో క‌ర్నూల్ జిల్లా నుంచి కోట్ల‌, అలాగే రాజంపేట నుంచి మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాకినాడ నుంచి ప‌ల్లం రాజులను ఎంపీలుగా పోటీ చేయ‌డం దాదాపు ఖాయం అయ్యాయ‌ని వార్త‌లు వస్తున్నాయి. తాజాగా మ‌రో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ప‌సుపులేటి బాల‌రాజు శాస‌న‌స‌భ స్థానానికి పోటీ చేస్తార‌నే వార్త రావ‌డంతో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రికి కొత్త భ‌యం పట్టుకుంది. టీడీపీ కాంగ్రెస్ పొత్తులో భాగంగా పాడేరు నుంచి పోటీ చేస్తాన‌ని నిర్ణ‌యించుకున్నారట బాల‌రాజు. ఈ మేర‌కు ప‌లుచోట్ల ముమ్మ‌రంగా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్ర‌యాణిస్తున్నారు.
 
ఇక ఈ విష‌యాన్ని గిడ్డి ఈశ్వ‌రి పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకువెళ్లినా స‌రైన స‌మాధానం రాలేదు దీంతో ఆమె గ‌తంలో అన‌వ‌స‌రంగా పార్టీ మారాన‌నే భావ‌న చెందుతుంద‌ట‌. కాగా ఈశ్వ‌రి మంత్రి ప‌ద‌వికోస‌మే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించాన‌ని ఆమె చెప్ప‌డం, అలాగే భారీగా డ‌బ్బు తీసుకుని పార్టీ మారార‌ని తాజాగా మావోయిస్టులు చెప్ప‌డంతో ఆమెపై ప్ర‌జ‌ల్లో సానుకూల‌త ల‌భించ‌లేద‌నే ఉద్దేశంతో పాడేరు టికెట్ ను కాంగ్రెస్ పార్టీకి అప్ప‌గించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సిద్దంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నారు.

షేర్ :

Comments

0 Comment