చీక‌టి ఒప్పందం కుదిరిందా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-16 12:26:15

చీక‌టి ఒప్పందం కుదిరిందా....

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం అమరావతి రాకపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడూ  బిజీబిజీగా ఉండే అంబానీ హఠాత్తుగా  అమరావతి లో ఎందుకు ప్రత్యక్షమయ్యారు..? ఆయన చంద్రబాబును కలసి ఏమి చర్చించారనే విషయంపై  అన్ని రాజ‌కీయ పార్టీల్లో  చ‌ర్చ జరుగుతోంది. 
 
రాష్ట్రంలో పెట్టుబడుల పైనే సీఎం చంద్రబాబుతో అంబానీ చర్చించారని, తిరుపతిలో జియో ఫోన్ల పరిశ్రమను స్థాపిస్తారని, ఇతర పరిశ్రమలు పెడతారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అయితే దీనిపై భిన్న‌మైన‌ వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన వచ్చింది పెట్టుబడులు పెట్టడానికి కాదని, వేరే కారణాలతో వచ్చారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
 
ముఖేశ్ అంబానీ పెట్టుబడులు పెట్టడానికే ఆంధ్రప్రదేశ్‌కు వస్తే అన్ని గంటల పాటు చంద్రబాబుతో గడపాల్సిన పని ఏమిటి...? కేంద్రంలో మారిన రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకున్నారు. ప్రధాని మోదీనే, అంబానీని రాయబారిగా పంపారు...అంటూ కొన్ని పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు సేవలు పెద్ద స్థాయిలో ఉండాలని వ్యాఖ్యానించి అంబానీ రాజకీయ ఊహాగానాలకు తెరతీశారు. 
 
ఈ భేటీ వెనుక ఏవో కీలకమైన రాజకీయ అంశాలు దాగి ఉన్నాయని చర్చించుకుంటున్నారు. అమ‌రావతికి పనిగట్టుకుని అంబానీ ఎందుకొచ్చార‌ని, ఏదైనా కీలక‌మైన పనిలేకపోతే ఆయన ఎక్కడకూ రారని రాజ‌కీయ నేతలు అంటున్నారు. రిల‌య‌న్స్ సంస్ధ‌కు సంబంధించి ఏపీ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతున్న మాధ‌వ‌రావుకి ఈ సారి రాజ్య‌స‌భ టికెట్ ఇవ్వాల‌ని ముఖేష్ అంబానీ  చంద్ర‌బాబుకు  సిఫార్స్ చేసిన‌ట్లు  కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.