చంద్ర‌బాబు దిల్లీ ప‌ర్య‌టన ర‌హ‌స్యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-05 15:52:36

చంద్ర‌బాబు దిల్లీ ప‌ర్య‌టన ర‌హ‌స్యం

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాలంటూ గ‌త కొన్ని రోజులుగా కేంద్ర పై రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు పోరాటం చేస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే.  హోదా ప్ర‌క‌టించాలంటూ పార్ల‌మెంటులో కేంద్ర ప్ర‌భుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి విధిత‌మే. ప్ర‌ధానంగా గ‌త ఎన్నిక‌ల్లో మిత్ర ప‌క్షంగా పోటి చేసి విజ‌యం సాధిందించిన టీడీపీ- బీజేపీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ఘోరంగా వైఫ‌ల్యం చెందాయి.
 
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌ కొత్త‌గా ఏర్పాటు అయిన ఏపీకి,  ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించకుండా  నాలుగేళ్లుగా మోసం చేసింది భార‌తీయజ‌న‌తా పార్టీ. గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో తిరుప‌తిలో ప్ర‌సంగించిన ప్ర‌ధాని అభ్య‌ర్థి న‌రేంద్ర మోది ప్ర‌త్యేకహోదా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌త్యేక‌హొదాను విస్మ‌రించారు మోడి... కేంద్ర ప్ర‌భుత్వంలో  మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ మోడి ఇచ్చిన హామీల‌ను సాధించుకోవ‌డంలో ఘోరంగా విఫ‌లం అయింది.
 
ప్ర‌స్తుతం సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ ఉనికిని కాపాడుకోవ‌డానికి ప్ర‌త్యేక‌హోదా అంశాన్ని తీసుకుని పోరాటం చేస్తున్నాయి రాజ‌కీయ పార్టీలు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి నాలుగు సంవ‌త్సరాలు మిత్ర‌ప‌క్షంగా ప‌రిపాల‌న చేసిన టీడీపీ-బీజేపి ప్ర‌త్యేక‌హోదా కోసం జ‌రుగుతున్న పోరాటం వీరి మైత్రి బంధానికి ముగింపు ప‌లికింది.కేంద్రానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు దిల్లీ ప‌ర్య‌ట‌న చేశారు. 
 
బీజేపీ, కాంగ్రెస్ యేత‌ర పార్టీల‌తోనే సంప్ర‌దింపులు జ‌రుపుతాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.... దిల్లీ ప‌ర్య‌ట‌న విఫ‌లం అయింద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు మాట త‌ప్పి కాంగ్ర‌స్ ముఖ్య నాయుకులతో స‌మావేశం అయ్యార‌ట. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌తో చంద్రబాబు భేటీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కాంగ్రెస్‌తో కలవనని చెబుతూనే ఆ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కావడం గమనార్హం. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌తో చంద్రబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో సాధించింది ఏమీ లేకపోవడంతో పబ్లిసిటీతో నెట్టుకురావడానికి బాబు బృందం గట్టిగా ప్రయత్నిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.