త్వ‌ర‌లో ఆ సీనియ‌ర్లు మొత్తం వైసీపీలోకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-10 13:45:15

త్వ‌ర‌లో ఆ సీనియ‌ర్లు మొత్తం వైసీపీలోకి

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రుగ‌క ముందు ఆయా పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగిన నాయ‌కులు. ఇక తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత రాజకీయాల‌కు మీడియా ఛాన‌ల్స్ కు దూరంగా ఉంటు వ‌చ్చారు.ఈ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు సుమారు ఐదు సంవ‌త్స‌రాల‌పాటు సైలెంట్ గా ఉన్నారు. 
 
ఇక 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తున్నారు. 2004-2009 లో ఎన్నిక‌లు ఏ విధంగా జ‌రిగాయో అధేవిధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌రుగుతాయ‌ని భావించి ఇత‌ర పార్టీల‌కు చెందిని సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. అయితే కొంత మంది 2014 ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత సీనియ‌ర్ నాయ‌కులు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీలోకి చేరారు. ఇక ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి అభివృద్ది చేయ‌క‌పోవ‌డంతో వారు కూడా వైసీపీ గూటికి చేరుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 
 
అయితే ఈ వరుస‌లో ఆనం ఫ్యామీలీ ముందంజ‌లో ఉంది. కొద్దిరోజుల క్రితం ఆనం వివేకానంద‌రెడ్డి మ‌రణించిన‌ప్ప‌టి నుంచి ఆ ఫ్యామిలీ టీడీపీనీ అంటిముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది.  పోయినంత‌కాలం టీడీపీలో తాము ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే రాజ‌కీయంగా త‌మ ఫ్యామిలీకి భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని గ్రహించి ఆనం సోద‌రుడు ఆనం రామనారాయ‌ణ రెడ్డి టీడీపీకి గుడ్ చెప్పి త్వర‌లో వైసీపీ తీర్థం తీసుకోనున్నారు. ఇక ఆయ‌న‌తోపాటు మానుగుంట‌ మహిధర్ రెడ్డి తను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. అంతేకాదు త్వ‌ర‌లో మ‌రికొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోటానికి సిద్దంగా ఉన్నారు. వైఎస్ హయాంలో రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగిన రాయ‌ల‌సీయ సీనియ‌ర్ నాయ‌కులు వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.