వైసీపీలోకి వ‌ల‌స‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-11 15:58:20

వైసీపీలోకి వ‌ల‌స‌లు

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఎంట‌ర్ అవ్వ‌నుంది. ఈ నెల 13 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో చేరేస‌రికి తెలుగుదేశం నాయ‌కులు ఇటు బీజేపీ నాయ‌కులు అటు కాంగ్రెస్ నాయ‌కులు వైసీపీలో చేరే అవ‌కాశం ఉంది అని అంటున్నారు కొంద‌రు నేత‌లు.ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో 15 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో వైసీపీ ఓట‌మి పాలైంది. జిల్లాలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా కాపు ఓట్లు బ‌లంగా అన్నీ సెగ్మెంట్ల‌లో తెలుగుదేశానికి ప్ర‌జ‌లు వేయ‌డంతో, మొత్తం విజ‌యం అంతా టీడీపీకి జిల్లాలో వ‌న్ సైడ్ అయింది.
 
ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో నెల రోజులపాటు 13 నియోజకవర్గాల్లో జ‌గ‌న్ పాద‌యాత్ర  కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ మరోవైపు చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో పాదయాత్ర లేకపోవడంతో అక్కడ కొంత అసంతృప్తి నెలకొంది. అయితే జ‌గ‌న్ ఇక్క‌డ త‌దుప‌రి బ‌స్సు యాత్ర చేస్తారు అని వైసీపీ నాయ‌కులు తెలియ‌చేస్తున్నారు.
 
క్షేత్ర‌స్దాయిలో జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌జ‌ల్లో మ‌రింత వెళుతోంది అని అనుకుంటున్నారు నాయ‌కులు. ఇప్ప‌టికే వైసీపీలో చేరేందుకు ఇద్ద‌రు తెలుగుదేశం మాజీలు, ముగ్గురు కాంగ్రెస్ మాజీలు జిల్లానుంచి రెడీ అయ్యారు అని వైసీపీ నాయ‌కుల‌తో మంత‌నాలు జ‌రిపారు అని  చ‌ర్చించుకుంటున్నారు.
 
అయితే కాంగ్రెస్ నాయ‌కులు ఇప్ప‌టికే ఫిక్స్ అయ్యారు పార్టీలో చేరేందుకు. ఇటు తెలుగుదేశం నాయ‌కులు ఎవ‌రు పార్టీ మార‌తారా అని పార్టీ ఇంట‌ర్న‌ల్ గా నివేధిక‌లు తెప్పించుకుంటోంది. అయితే జిల్లా తెలుగుదేశం నుంచి ఇప్ప‌టికే అధిష్టానానికి తెలియ‌చేశార‌ట పార్టీ జింపింగ్ అవ్వాలి అనుకునే వారి జాబితా. వీరితో అధిష్టానం చ‌ర్చ‌లు జరుపుతోంద‌ట‌.
 
వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవలే డెల్టా, మెట్ట ప్రాంతానికి చెందిన సీనియర్‌ నేతలు కొందరితో మంతనాలు నడిపారు. వారిలో హరిరామజోగయ్య, కరాటం రాంబాబు వంటి నాయకులు ఉన్నారు అని తెలుస్తోంది.. హ‌రిరామ జోగయ్య ఆయన కుమారుడు సూర్య‌ప్ర‌కాశ్ కూడా వైసీపీ వైపు చూస్తున్నారు అని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు సీనియర్‌ నేతలు నేరుగా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
 
జ‌గ‌న్ పాద‌యాత్ర ఇక్క‌డ కాపులు బీసీల‌కు ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటూ ముందుకు వెళ్లాలి అని విశ్లేష‌కులు చెబుతున్నారు.గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నుంచి  ఒక్క సీటు కూడా గెల‌వ‌క‌పోవ‌డంతో ఇప్పుడు పొలిటిక‌ల్ గా ఇక్క‌డ జ‌గ‌న్ ఎటువంటి స్ట్రాట‌జీతో ముందుకు వెళ‌తారా అని ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.