చంద్ర‌బాబు పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-04-08 05:35:02

చంద్ర‌బాబు పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట అయిన గుంటూరు జిల్లా తెనాలిలో నిర్విరామాంగా కొన‌సాగుతోంది... పేరుకు మాత్ర‌మే టీడీపీ కంచుకోట అయినా ఆ ప్రాంతంలో జ‌న‌నేత అడుగు వేయ‌డంతో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌తో తెలుసుకుంటూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా ప్ర‌జ‌సంక‌ల్ప‌యాత్ర‌లో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌గ‌న్...  2014 ఎన్నిక‌ల్లో  త‌ప్పుడు హామీల‌ను ప్ర‌జ‌ల‌కు ప్ర‌క‌టించి అధికారాన్ని ద‌క్కించుకున్న చంద్ర‌బాబు ఇంత వ‌ర‌కూ ఒక్క హామీ కూడా అమ‌లు చేయ‌లేద‌ని ఆరోపించారు... కేవ‌లం త‌న స్వార్ద రాజ‌కీయాల కోసం ఎన్డీఏతో మిత్రప‌క్షం వ్య‌వ‌హ‌రించి అక్ర‌మంగా ప్ర‌జా ద‌నాన్ని అధికార బ‌లంతో విదేశాల‌కు త‌ర‌లిస్తున్నావు అస‌లు నువ్వు మ‌నిషివేనా అని మండిప‌డ్డారు జ‌గ‌న్..
 
అయితే మ‌ళ్లీ ఇప్పుడు అఖిల పక్షం పేరుతో కొత్త‌నాట‌కం  తెర లేపుతున్నారు.. ఈ నాట‌కం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ప్ర‌జ‌ల‌ను ఎలా మోసం చేయాలి అనే అలోచ‌న‌లో ముఖ్య‌మంత్రి ఉన్నార‌ని అన్నారు... సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బాబు  గెల‌వాలంటే ఇంటింటికీ కిలో బంగారం, బెంజికారు, ఓటుకు రూ. 3 వేలు ఇస్తానని హామీలివ్వటానికి వెనకాడరన్నారు. ‘‘ఓటుకు రూ.3వేలిస్తే రూ. 5వేలు డిమాండ్‌ చేయండని జ‌గ‌న్ తెలిపారు... కాని ఓటు మాత్రం మీ మ‌న‌స్సాక్షికి చెప్పిన వారికి మాత్ర‌మే ఓటు వేయ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు జ‌గ‌న్ 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.