సంచ‌ల‌నం రేపుతున్న కొమ్మినేని క‌థ‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 11:43:43

సంచ‌ల‌నం రేపుతున్న కొమ్మినేని క‌థ‌నం

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు కొన‌సాగుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం  ప్ర‌త్యేక హొదా ఇవ్వ‌క‌పోతే రాజీనామాల‌కు సిద్దం అని జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం....రాజీనామాలు కాదు అవిశ్వాసం పెట్టాల‌ని ప‌వ‌న్ సూచించ‌డం అంద‌రికీ తెలుసు. 
 
ఇందుకు జ‌గ‌న్ స్పందిస్తూ... తాము అవిశ్వాసం పెట్టేందుకు సిద్దం, ఒక‌వేళ టీడీపీ అవిశ్వాసం పెట్టినా  మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్దం అని ప్ర‌క‌టించారు. దీంతో ఇప్పుడు  జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు ప‌వ‌న్ స్పందించిన తీరుపై  దేశవ్యాప్తంగా  చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అవిశ్వాస తీర్మానం పెడితే తాను మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.
 
ఒక్క ఎంపీతోనైనా అవిశ్వాసం పెట్టించ‌వ‌చ్చ‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. అవిశ్వాసం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు 50 మంది స‌భ్యులు లేచి నిల‌బ‌డాల‌ని, వైసీపీ,టీడీపీ ఇప్ప‌టికే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయ‌ని, టీఆర్ ఎస్ పార్టీ, స‌మాజ్ వాదీ పార్టీ తో పాటు రాహుల్ గాంధీ కూడా మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు... మిగ‌తా పార్టీల మ‌ద్ద‌తు కూడ‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని ప‌వ‌న్ తెలిపారు. ముందు అవిశ్వాస తీర్మానం పెట్టండి... 50 కాదు సుమారు 80 మంది ఎంపీల మ‌ద్ద‌తు వ‌స్తుంద‌ని ప‌వ‌న్ ధీమా వ్య‌క్తం చేశారు.
 
అయితే, జ‌గ‌న్ స‌వాల్ కు రిప్లై బాగానే ఉందంటూ త‌న వెబ్ సైట్ లో ప‌వ‌న్ ను సమ‌ర్ధించారు ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు. ఇక్క‌డ పవ‌న్ ను స‌మ‌ర్ధిస్తున్నారంటే....జ‌గ‌న్ ను విమ‌ర్శిస్తున్నార‌ని కాదు అర్ధం. కేవ‌లం ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రైనా స‌మ‌ర్ధించాల్సి వ‌స్తుంది. 
 
మిత్ర ధ‌ర్మాన్ని ప‌క్క‌కునెట్టి ఏపీకి రావాల్సిన వాటిని వెంట‌నే అమ‌లు చేయాలంటూ బీజేపీని  డిమాండ్ చేస్తోంది టీడీపీ. ఎన్డీఏ ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టేందుకు తాము కూడా సిద్ద‌మ‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఇక ఏపీకి న్యాయం చేయాలంటూ  సాక్షాత్తు పార్ల‌మెంట్ సాక్షిగా తెలంగాణ ఎంపీ క‌విత  మ‌ద్ద‌తు ప‌లికారు.
 
ఈ క్ర‌మంలో  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడితే  ఎవ‌రి ప్ర‌క‌ట‌న‌ల్లో  నిజ‌ముంద‌నే వాస్త‌వం ప్ర‌జ‌ల‌కు తెలుస్తోంది. మ‌రి ఇలాంటి ప‌రిస్ధితుల్లో వైకాపా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన అంశం. రాజ‌కీయాల్లో విశ్వ‌స‌నీయ‌త ఉండాల‌ని ప్ర‌సంగాలు ఇస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ నిజంగానే త‌న ప్ర‌క‌ట‌న‌ల‌ను నిజం చేస్తార‌ని, ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగిస్తార‌నే విశ్వాసంతో వైసీపీ శ్రేణులు ఉన్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.