ఓటుకు నోటు పై సంచ‌ల‌న డెసిషన్..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu-naidu-vote-for-note-case
Updated:  2018-02-25 04:30:36

ఓటుకు నోటు పై సంచ‌ల‌న డెసిషన్..?

ఏపీ తెలంగాణ‌లో  వోట్ ఫ‌ర్ నోట్ డొంక క‌దులుతోంది... కేంద్రంలో కాస్త ఓటుకు నోటు కేసు గురించి క‌ద‌లిక వ‌చ్చింది.. అలాగే ఇక్క‌డ నాయ‌కుల‌కు చ‌ల‌నం వ‌చ్చింది.. క‌ర‌క‌ట్ట‌కు ప‌రుగులు పెట్టించిన కేసు, ప్ర‌త్యేక హూదా వ‌ద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని ప‌లికించిన కేసు ఇది.
 
అయితే ఇక్క‌డ ఓటుకు నోటుకేసు రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నాల‌కు క్రియేట్ చేయ‌నుంది.. తాజా రాజ‌కీయాలు ప‌రిశీలిస్తే  కేంద్రం దీనిని తెరపైకి తీసుకురాలేదు.. ఇటు తెలంగాణ స‌ర్కారు అటు ఏపీలో తెలుగుదేశం తెర‌పైకి తీసుకువ‌చ్చాయి  అంటున్నారు విశ్లేష‌కులు.. మ‌త్త‌య్య సీజేకు లేఖ‌రాయ‌డంతో ఇప్పుడు ఈ కేసు పై  చ‌ర్చ జరుగుతోంది. ఈ విష‌యంలో తెలంగాణ స‌ర్కార్ ఎటువంటి ముందు అడుగు వేయ‌డం లేద‌ని, ఏసీబీకి కాకుండా సీబీఐకి ఈ కేసు అప్ప‌గించాలి అని ఎమ్మెల్యే  ఆర్కే సుప్రీంని గ‌తంలో ఆశ్ర‌యించారు.. అయితే సుప్రీం నుంచి బాబుకు దీనిపై ఎదుద‌రుదెబ్బ త‌గులుతుంది అని అనుకున్నారు, కాని ఎటువంటి ముందు అడుగు ప‌డ‌లేదు.
 
ఇప్పుడు నిజంగా నిప్పా లేదా ఏమైనా ప్రోద్బ‌లం ఉందా అనేది తేలిపోనుంది అంటున్నారు కొంద‌రు సీనియ‌ర్లు. ఇక్కడ బ్రీఫ్ డు మీ వాయిస్ నాది కాదు అని ఏ నాడు ఆయ‌న ఖండించ‌లేదు...నా ఫోన్ ఎలా ట్యాప్ చేస్తారు అని మాత్ర‌మే అనేవారు.. ఈ కేసులో ఏ4గా ఉన్నాడు మ‌త్త‌య్య‌. అప్రూవర్ గా మారుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిన ప్రతి సంఘటన తనకు తెలుసంటున్నాడు మత్తయ్య. 
 
ఈ కేసు విషయంలో హైకోర్టు తన వాదన వినకుండానే ఆదేశాలు ఇచ్చిందని మత్తయ్య అంటున్నాడు. అయితే ఇది నిజంగా సుప్రీం కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని, ఏసీబీ నుంచి సీబీఐకి కేసు అప్ప‌గించింతే ప‌రిస్ధితిలో చాలా మార్పు వ‌స్తుంది.. రాజ‌కీయంగా ఏపీలో కుదుపు వ‌స్తుంది. నిజంగా బ్రీఫింది ఎవ‌రో తేలిపోతుంది. కేంద్రం కూడా దీనిపై ఓ సంచ‌ల‌న డెసిష‌న్ తీసుకుంటుంది అంటున్నారు.. ఇక తెలంగాణ‌లో కాంగ్రెస్ కు చెక్ పెట్టాలి అంటే రేవంత్ ను మాట్లాడ‌నివ్వ‌కుండా ఉంచాలి అంటే ఓటుకు నోటు ఒక‌టేగా మార్గం.

షేర్ :

Comments

1 Comment

  1. ￰దొంగలూ దొంగలూ ఊళ్ళు పంచుకున్నట్టు ఉంది వీళ్ల వ్యవహాà°

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.