సంచ‌ల‌నం ప్యాకేజి మేమే ఒప్పుకున్నాం మంత్రి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-26 11:39:41

సంచ‌ల‌నం ప్యాకేజి మేమే ఒప్పుకున్నాం మంత్రి

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ విశాఖ రైల్వే జోన్ ల సాధ‌న కోసం ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిరంత‌రం కేంద్రంతో పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.అంతే కాదు ఈ పోరాటంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మోడీతో పొత్తు పెట్టుకుని ప్ర‌త్యేక హోదా బ‌ధులు ప్ర‌త్యేక ప్యాకేజికి అమ్ముడు పోయార‌ని జ‌గ‌న్ భ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశారు.
 
అయితే జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల పై తెలుగు త‌మ్ముళ్లు త‌ప్పుబ‌డుతూ త‌మ నాయ‌కుడు ప్ర‌త్యేక హోదానే కావాల‌న్నార‌ని, అయితే ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గన్ కావాల‌నే త‌మ‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఎల్లో మీడియా ద్వారా విమ‌ర్శ‌లు చేసిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి.
 
అయితే తాజాగా తెలుగు త‌మ్ముళ్లు చేసిన వ్యాఖ్య‌ల‌కు చెక్ ప‌డింది. టీడీపీ ప‌త్తికొండ ఎమ్మెల్యే, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి క‌ర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సాక్షిగా మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజికి కేంద్రం తో ఒప్పుకున్నార‌ని టీడీపీలో ఇన్నాల్లు దాగివున్న నిజాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశారు కేఈ. అయితే ప్యాకేజి కింద హోదాకు స‌రిప‌డ నిధుల‌ను ఇస్తామ‌న్నందుకే త‌మ నాయ‌కుడు ప్యాకేజికి ఒప్పుకున్నార‌ని కేఈ కృష్ణ‌మూర్తి స్ప‌ష్టం చేశారు.
 
కానీ కేంద్రం ప్రత్యేక ప్యాకేజి కింద నిధులు ఇవ్వకుండా ఏపీ రాష్ట్రాన్ని తీవ్ర‌ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. అందుకే తాము యూట‌ర్న్ తీసుకుని హోదా అడుగుతున్నామన్నారు. తాము ఏపీకి ప్ర‌త్యేక హోదా అడుగుతున్నామ‌ని ప్ర‌ధాని మోడీ చుల‌క‌న‌గా చూస్తున్నార‌ని కేఈ అరోపించారు. ఆంధ్రుల‌ను అవ‌మానించిన బీజేపీ త్వ‌ర‌లో మ‌ట్టికొట్టుకు పోతుంద‌ని అన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.