చంద్రబాబు తోటి సీఎం ని చూసి బుద్ది తెచ్చుకో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-27 10:29:43

చంద్రబాబు తోటి సీఎం ని చూసి బుద్ది తెచ్చుకో

ఆంధ్ర రాష్ట్రం లో రోజు రోజు కి మహిళలపైన దాడులు మానభంగాలు పెరిగిపోతున్నాయని రక్షణ కరువైంది అని పక్క రాష్ట్ర సీఎం కెసిఆర్ ని చూసి చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలని వైస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి సూచించారు. 
 
ఎందుకంటే కెసిఆర్ మహిళలపై ప్రత్యేక శ్రద్ధతో మహిళల రక్షణకై షీ టీం ను ప్రారంభించారని అంతే కాకుండా ఒక అడుగు ముందుకు వేస్తూ బాలికలు అనేక కారణాల చేత స్కూల్స్ కు మానేస్తున్నారని తెలుసుకొని వారి సౌకర్యార్థం సానిటరీ పాడ్స్ మరియు టాయిలెట్ కిట్స్, అందచేస్తున్నారని ఆమె తెలియజేసారు.
 
40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే నువ్వు ఏరోజైనా మహిళల గురించి ఆలోచించావా అని ఆమె ప్రశ్నించారు. మొదటి సారి సీఎం అయినా కెసిఆర్ గారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అని ఆమె ఎద్దవా చేశారు.  
 
ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో ఒక మహిళా పై దాడి చేసి చేతులు నరికి అతి దారుణంగా హింసించి భర్తని కిడ్నప్ చేసారని  ....నిన్న చిత్తూర్ లో మైనరు బాలికపైనా అత్యాచారము....  మొన్న కాకినాడ JNTU కాలేజీ లో లెక్చరర్ పైశాచిక ఆనందం కొరకు విద్యార్థినీలపైనా అసభ్యకరంగా ప్రవర్తించడం ఇలా చెప్పుకుంటూ పోతే రోజు ఒకటి... వెలుగు లోకి వస్తున్నాయని ఆమె అన్నారు. 
 
మహిళలకు రక్షణ కల్పించాలంటే 40 సంవత్సరాల అనుభవం అవసరం లేదని మహిళల క్షేమం గురించి ఆలోచించే మంచి మనసు మరియు తపన ఉంటే చాలని అది ప్రతిపక్ష నేత జననేత జగన్ మోహన్ రెడ్డిలో ఉందని, జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితేనే మహిళలు మాన, ప్రాణాలతో సుఖసంతోషాలతో ఉండగలరని ఆమె జ్యోస్యం చెప్పారు. అందుకే జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇఛ్చి సీఎం గా చేయవలసినదిగా ఆమె కోరుకున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.