అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన శిల్పా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

shilpa chakrapani reddy image
Updated:  2018-02-26 05:16:10

అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన శిల్పా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్ల‌మెంట్ ఇన్ ఛార్జ్ శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి మీడియా వేదిక‌గా మ‌రోసారి ఏపీ స‌ర్కార్ పై తీవ్ర స్ధాయిలో మండిప‌డ్డారు. హోదా కోసం మొద‌టి నుండి వైసీపీ అలుపెరుగ‌ని పోరాటం చేస్తోంద‌ని శిల్పా  తెలిపారు. హోదా కోసం యువ‌భేరి వంటి అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించార‌ని అన్నారు. 
 
మార్చి మూడున పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు, ముఖ్యనాయకులంతా జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి, ఐదున ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద మహాధర్నాలో పాల్గొంటామని తెలిపారు. తెలుగు ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు ఢిల్లీలో వినిపిద్దాం.. ప్రత్యేక హోదా సాధిద్దాం.. అంటూ ఆయన నినాదం ఇచ్చారు. 
 
ప్రత్యేక హోదా క్రెడిట్ జ‌గ‌న్‌కి ద‌క్క‌కూడ‌ద‌నే ప‌వ‌న్ తో  క‌లిసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాట‌కాలు డుతున్నారంటూ అస‌లు సీక్రెట్ ను బ‌య‌ట‌పెట్టారు శిల్పా. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హోదా విషయంలో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, రాజకీయాలంటే సినిమాలు తీసినంత సుల‌భం  కాదంటూ ఆయ‌న విమ‌ర్శించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.