పొలిటిక‌ల్ స్టోరీ ఆప‌రేష‌న్ గ‌రుడ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-23 15:36:45

పొలిటిక‌ల్ స్టోరీ ఆప‌రేష‌న్ గ‌రుడ

సినిమాహీరో శివాజీ రాజ‌కీయాల్లో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటున్న రాజ‌కీయ‌నాయకుడు అయ్యారు.. తాజాగా ప్ర‌త్యేక హోదా నినాదంతో ఏపీలో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చారు శివాజీ.. ఇటీవ‌ల ఆయ‌న ఓ పొలిటిక‌ల్ స్టోరీ చెప్పారు.. ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ఓ జాతీయ పార్టీ  ఆపరేషన్‌ గరుడ  చేపట్టబోతోందని  శివాజీ ఓ సెన్సేష‌న‌ల్ న్యూస్ రివీల్ చేశారు.
 
ఆ జాతీయ‌పార్టీ ల‌క్ష్యం ద‌క్షిణాది రాష్ట్రాల‌ను టార్గెట్ చేయ‌డం అని చెప్పారు... ద‌క్షిణాది రాష్ట్రాల‌ను టార్గెట్ గా పెట్టుకున్న ఆప‌రేష‌న్ ని ద్ర‌విడ అని, అందులో ఏపీ తెలంగాణ కు ఆప‌రేష‌న్ గ‌రుడ, అలాగే త‌మిళ‌నాడు కేర‌ళ‌కు ఆప‌రేష‌న్ రావ‌ణ, అలాగే క‌ర్ణాట‌క‌కు ఆప‌రేష‌న్ కుమార అని ఆ పార్టీ పేరు పెట్టింది అని తెలియ‌చేశారు శివాజీ.
 
ఇదంతా ఓ రాజ్యాంగ శ‌క్తి న‌డిపిస్తోందని తెలియ‌చేశారు..ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసేందుకు రూ.4,800 కోట్లు కేటాయించారని, ఇప్ప‌టికే సగం నిధులు ఖ‌ర్చుచేశారు అని ఆయ‌న తెలియ‌చేశారు. అయితే త‌న‌కు ఈ విష‌యం ఎలా తెలుసు అంటే 2013 నుంచి జాతీయ రాజ‌కీయాలు అబ్జ‌ర్వ్ చేస్తున్నా నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు వారి ద్వారా ఓ మిత్రుడు నాకు ఈ విష‌యాన్ని తెలియ‌చేశాడు వారు తెలుగుప్రాంతానికి చెందిన వారే అని తెలిపారు శివాజీ.
 
ఇక ఓ కొత్త పార్టీని పెట్టి ఆ జాతీయ పార్టీ రాజ‌కీయాలు చేయ‌బోతోంద‌ని, అధికార పార్టీ పై కేసులు పెట్టి వారిని ఇరికించాలి అనే ప్లాన్ వేసింది అని అలా వారిని ప‌ద్మ‌వ్యూహాంలో చిక్కుకునేలా చేసి మ‌రో ప్ర‌ధాన పార్టీ అధినేత‌ను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు అని అన్నారు. ఇక ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు ఓ నాయ‌కుడు దిగుతాడ‌ని ఆ స‌మ‌యంలో ఏపీలో అల్ల‌ర్లు వ‌ల్ల కేంద్రం ప్ర‌త్యేక హూదా ప్ర‌క‌ట‌న  చేస్తుంది అని ఆ క్రెడిట్ పార్టీలు మైలేజ్ తెచ్చుకుంటాయి అని అంటున్నారు.... అందుకే ప్ర‌జ‌లు ఆచితూచి అడుగులు వెయ్యాలి అని ఏపీలో ప్ర‌జ‌లు మేల్కొనాలి అని నాయ‌కులు ఆ పార్టీ నేత‌లు కాస్త తెలుసుకోవాలి అని ఈ విష‌యం తెలియ‌చేశాను అని చెప్పారు శివాజీ.

షేర్ :

Comments

1 Comment

  1. Ore TDP Broker vedava emi sollu cheppavura sodi well done Mr. Sivagi U R very great actor Oskar range needi

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.