ఉండవల్లికి షాక్ ఇచ్చిన‌ శివాజీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-27 06:29:21

ఉండవల్లికి షాక్ ఇచ్చిన‌ శివాజీ

ఏపీ రాజ‌కీయాల పై కేంద్ర ప్ర‌భుత్వం ఆపరేషన్ గరుడా అమ‌లు చేయ‌బోతుందంటూ  ఇటీవల హీరో శివాజి అల‌జ‌డి రేపిన విష‌యం తెలిసిందే.  దీని పై స్పందించిన‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ  హీరో శివాజి  వెల్ల‌డించిన ఆపరేషన్ గరుడా అంతా ఒక బూట‌క‌మ‌ని అన్నారు. ఆపరేషన్ గరుడా లేదు గాడిద గుడ్డూ లేదంటూ శివాజిని తీవ్రంగా విమ‌ర్శించారు.
 
ఈ వార్త మీడియాలో పెద్ద ఎత్తున హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో శివాజీ ప్రతిస్పందించారు. తాను ఏదో చెబితే ఉండవల్లికి ఉలుకెందుకని ప్రశ్నించారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఉండవల్లిని గమనిస్తున్నానని... ఆయనకు ఎవ‌రు ప్రశాంతంగా ఉండడం ఇష్టముండదని శివాజి విమర్శించారు.  ఏదో ఒక పక్షంలో చేరి మరో పక్షంపై బురద జల్లుతుంటారని.. ఆయనకు అందాల్సిన బెనిఫిట్‌ ఏదో ఒక రూపంలో అందుతూనే ఉంటుందని శివాజీ ఆరోపించారు.
 
ఉండవల్లి చెప్పేది భగవద్గీత…. తాము చెబితే పిచ్చి మాటలా అని ప్రశ్నించారు. అసలు ప్రతి నాలుగు రోజులకొకసారి ఉండవల్లి ఎందుకు ప్రెస్‌మీట్ పెడుతున్నారని శివాజీ అసహనం వ్యక్తం చేశారు. తనను కెలకవద్దని ఉండవల్లికి వార్నింగ్ ఇచ్చారు. కెలికితే రెండేళ్లుగా ఉండవల్లి పోలవరంపై ఏఏ అంశాలు చెప్పారో వాటికి కౌంటర్‌గా వీడియోలు చేయాల్సి ఉంటుందన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.