లోకేషే టార్గెట్.. చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తున్న శివాజీ వ్యాఖ్యలు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

babu and lokesh and shivaji
Updated:  2018-10-17 03:59:47

లోకేషే టార్గెట్.. చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తున్న శివాజీ వ్యాఖ్యలు..

మంత్రి నారా లోకేష్ పై త్వరలో సిబిఐ దాడులకు రంగం సిద్దమవుతోందా..? సినిమా నటుడు, గత కొన్ని నెలలుగా బిజెపి కి వ్యతిరేకంగా గళం విప్పుతున్న శివాజీ చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలియ చేసే శివాజీ ఈ సారి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో చెప్పారంటూ  రావటం అనుమానం కలిగిస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే వ్యాఖ్యలు అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి లోకేష్ ఫై దాడులు చేసేందుకు ఏవేవి కారణాలు ప్రధానం.. ఇప్పుడు చూద్దాం.. 
 
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖలకు నారా లోకేష్ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఐటి కంపెనీలకు ఇష్టారాజ్యంగా భూములను ఇచ్చేస్తున్నారు. పరిశ్రమలు రావాలంటే భూములతో పాటు కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాటాన్ని ఎవరూ కాదనరు. కానీ భూములను, ప్రోత్సహకాలను తీసుకుంటున్న యాజమాన్యాలు పరిశ్రమలను పెట్టాలి, ఒప్పందాల్లో చెప్పినట్లుగా ఉద్యోగాలు, చుట్టు పక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, అయితే అలా ఏమి జరగట్లేదు అని అభిప్రాయం ప్రజల్లో కలిగించటానికి తాజాగా సిబిఐ దాడులు అని హడావిడి చెయ్యటానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.