శివాజి చెప్పిన‌ట్లే జ‌గ‌న్ పై దాడి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and shivaji
Updated:  2018-10-25 05:12:36

శివాజి చెప్పిన‌ట్లే జ‌గ‌న్ పై దాడి

ఏపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ నాయ‌కుల చ‌రిత్ర ప్ర‌స్తుతం తెలుగుచిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన హీరో  శివాజి చేతుల్లో ఉందా.. అంటే అవున‌నే అంటున్నారు తాజా రాజ‌కీయ విశ్లేష‌కులు. ఆప‌రేష‌న్ గ‌రుడా అంటూ రాష్ట్రంలో కొద్దిరోజుల పాటు హల్ చ‌ల్ చేశారు శివాజి. అయితే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కొంద‌రు సిల్లీగా తీసుకున్నారు. 
 
గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు శివాజి చెప్పిన విధంగానే  ఆయ‌న‌కు కోర్టు నుంచి నోటీసులు వ‌చ్చాయి. అంతేకాదు మ‌రికొన్ని రోజుల్లో ఏపీలో ఐటీ దాడులు జ‌రుగుతాయి అని చెప్పారు. అయ‌న చెప్పిన‌ట్లుగానే ఎంపీ సీఎం ర‌మేష్ ఇంటిపై ఐటీ దాడులు జ‌రిగాయి. 
 
అలాగే ఈ గ‌రుడ‌లో భాగంగా ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై అక్టోబ‌ర్ లో దాడులు జ‌రిగి జ‌రుగ‌న‌ట్లుగా దాడి జ‌రుగుతుంద‌ని ఈ దాడిని ఖండిస్తూ రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని అప్పుడెప్పుడో చెప్పారు. అయితే ఇది సినిమా స్టోరీ అని ప్ర‌తిఒక్క‌రు భావించారు. కానీ ఇప్పుడు శివాజి చెప్పిన విధంగా జ‌గ‌న్ పై దాడి జ‌రిగింది దీంతో మ‌రోసారి ఆప‌రేష‌న్ గ‌రుడా వెలుగులోకి వ‌చ్చింది.

షేర్ :

Comments

0 Comment