ఆంధ్ర‌జ్యోతి, ప‌రిటాల వ‌ర్గానికి షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-09 06:06:03

ఆంధ్ర‌జ్యోతి, ప‌రిటాల వ‌ర్గానికి షాక్

అనంత‌పురం జిల్లాలో ప‌రిటాల ఫ్యామిలీకి, తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి ఫ్యామిలీకి ఉన్న రాజ‌కీయ వైరం అంద‌రికీ తెలిసిందే. ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఎప్ప‌టి నుంచో  రాజ‌కీయ, ఆధిప‌త్య  పోరు కొన‌సాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే  గ‌తంలో ప‌రిటాల రవి పై జ‌రిగిన కారు బాంబు  దాడి కేసులో తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్నారు. 
 
తాజాగా ఈ కేసుకు సంబంధించిన వ్య‌వ‌హారంలో అధికార పార్టీకి అనుకూల మీడియాగా ముద్ర వేసుకున్న ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌కు, ప‌రిటాల వ‌ర్గానికి షాక్ త‌గిలింది. అనంత‌పురం కోర్టులో కారు బాంబు కేసులో త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారంటూ   ప్ర‌కాష్ రెడ్డి దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం దావా కేసు విచార‌ణ ముగిసింది. 
 
ఈ కేసును విచారించిన న్యాయ‌స్ధానం తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేద‌ని తీర్పు వెలువ‌రించింది.  దీంతోపాటు ప్ర‌కాష్ రెడ్డిపై  అస‌త్య ఆరోప‌ణ‌లు చేసినందుకుగానూ  మంత్రి ప‌రిటాల సునీత స‌మీప బంధువు ఎల్. నారాయ‌ణ చౌద‌రి రూ.10 ల‌క్ష‌లు ఆంధ్ర‌జ్యోతి సిబ్బంది ల‌క్ష రూపాయ‌లు చెల్లించాల‌ని కోర్టు వెలువ‌రించింది. కోర్టు తీర్పుపై  తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి వ‌ర్గం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.