ఎన్నికల సమరాన టీడీపీ కి షాక్.. వైసిపి లోకి కీలక జిల్లా స్థాయి నేతలు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp and tdp
Updated:  2018-10-24 01:23:04

ఎన్నికల సమరాన టీడీపీ కి షాక్.. వైసిపి లోకి కీలక జిల్లా స్థాయి నేతలు..

ఎన్నికలు దగ్గరపడుతుండంతో టీడీపీ రోజు రోజుకి బలహీనపడిపోతుంది.. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో పేరున్న మేకపాటి, ఆనం, నేదురుమల్లి కుటుంబాల నాయకులందరూ వైకాపాలో చేరారు. ఇక ఇప్పుడు జిల్లా స్థాయి నాయకులందరూ కూడా మూకుమ్మడిగా వైకాపాలో చేరడం టిడిపి అధినేత చంద్రబాబును కూడా షాక్‌కి గురిచేస్తోంది.  ఇంతకీ ఎవరా నాయకులూ.. ఇప్పుడు చూద్దాం..
 
2014 ఎన్నికల్లో కూడా నెల్లూరు జిల్లాలో వైకాపాకు ధీటుగా నిలబడలేకపోయింది టిడిపి. ఇక ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా పేరున్న రాజకీయ కుటుంబాలన్నీ వైకాపాకే మద్దతుగా నిలుస్తున్నాయి. వేరే ఏ జిల్లాలోని లేని విధంగా ప్రముఖంగా పేరు తెచ్చుకున్న కుటుంబాలన్నీ వైకాపాలోనే చేరడం టిడిపి క్యాడర్‌ని నిరుత్సాహపరుస్తోంది. ఇప్పుడు సెకండ్ గ్రేడ్ నాయకులందరూ కూడా టిడిపిని వీడి వైకాపాలో చేరడం టిడిపి అధిష్టానంలో కూడా ఆందోళన పెంచుతోంది.
 
జిల్లా స్థాయిలో అసలేం జరుగుతోంది? పార్టీని పూర్తిగా ఖాళీ చేయించేస్తారా..? అని చెప్పి స్వయంగా చంద్రబాబే, మంత్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. అగ్రశ్రేణి కుటుంబాలన్నీ వైకాపాలోనే ఉన్నా సెకండ్ గ్రేడ్ నాయకులు టిడిపికి మద్దతుగా ఉన్నారు అనుకుంటే తాజాగా టిడిజి నెల్లూరు జిల్