బాబు అవిశ్వాసానికి బిగ్ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 18:57:30

బాబు అవిశ్వాసానికి బిగ్ షాక్

దేశం మొత్తం మీద చూస్తే... ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు... ఎందుకంటే గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు  కేంద్ర ప్ర‌భుత్వంతో మిత్ర ప‌క్షంగా  వ్య‌వ‌హ‌రించినా కానీ, విభ‌జ‌న హామీల్లో ఏ ఒక్క దానిని కూడా సాధించ‌లేకపోయారు... పోనీ చివ‌రి బ‌డ్జెట్ లో అయినా  రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టిస్తారా అని అనుకుంటే బ‌డ్జెట్ స‌మావేశంలో కేంద్రం క‌నీసం దాని ప్ర‌స్తావ‌న  కూడా తీసుకురాలేదు... దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తిప‌క్షాలు, మిత్రప‌క్షాలు  ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ నిర‌స‌న‌లు చేస్తున్నాయి.
 
అయితే ఇప్ప‌టికే కేంద్రం వైఖ‌రిని నిర‌సిస్తూ  వైసీపీ నేత‌లు అవిశ్వాస తీర్మానం పెట్టారు.. ఈ తీర్మానానికి టీడీపీ మ‌ద్ద‌తు కావాల‌ని   వైసీపీ నేత‌లు కోరారు... ఈ నేప‌థ్యంలో బాబు త‌న 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయానికి ప‌దును పెట్టారు.. తాను వైసీపీ కి మ‌ద్ద‌తు తెలిపితే అధికారంలో  ఉండి కూడా తాము అవిశ్వాసం పెట్ట‌లేద‌ని ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తే ప‌రిస్థితులు తారుమారు అవుతాయ‌ని భావించారు.. దీంతో ఎన్డీయే నుంచి  తాను కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి  కేంద్రంపై అవిశ్వాసం పెట్ట‌డానికి రెడి అయ్యి నోటీసులు ఇచ్చి అవిశ్వాసం పెట్టారు.
 
అయితే బాబు అవిశ్వాసానికి మొద‌ట్లో ప‌లు ప్రాంతీయ‌ పార్టీలు ఏడీఎంకే, వామపక్షాలు, ఎంఐఎం, శివసేన, టీఆర్ఎస్‌లు టీడీపీకి మ‌ద్ద‌తు తెలిపాయ‌ని చంద్ర‌బాబు అనుకూల మీడియాలు తెలిపాయి..అయితే   కొద్దిరోజుల క్రితం బాబు అవిశ్వాసానికి అన్నాడీఎంకె పార్టీ నాయ‌కులు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని తెలిపారు.. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం త‌మ మ‌ద్ద‌తును వెన‌క్కి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది..
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు తమకేమీ సంబంధం లేదని, చంద్ర‌బాబు అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని లోకసభలో అన్నాడియంకె నేత వేణుగోపాల్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్ల‌డించారు... అన్నాడీఎంకెకు 37 మంది లోకసభ సభ్యులున్నారు, వారెవ్వ‌రు కూడా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌ర‌ని స్ప‌ష్టం చేశారు... అయితే  అన్నాడీఎంకె మ‌ద్ద‌తు వెన‌క్కి తీసుకోవ‌డంతో బాబు డైల‌మాలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది... టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్పి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌లేదు అప్పుడే అన్నాడీఎంకె నాయ‌కులు త‌మ మ‌ద్ద‌తు వెన‌క్కి తీసుకోవ‌డ‌మేంట‌ని బాబు తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.