చిన‌రాజ‌ప్ప‌కు ఝ‌ల‌క్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chinarappa
Updated:  2018-11-05 04:39:21

చిన‌రాజ‌ప్ప‌కు ఝ‌ల‌క్

ఇటీవ‌లే ఎపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు హ‌స్తిన సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌లిసి 2019 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌తో పాటు ఏపీలో కూడా పొత్తు కుదుర్చు కున్నారు. ఇక ఈ పొత్తు కుదిరిన‌ప్ప‌టి నుంచి ఇటు ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుల‌తో పాటు ఇటు పార్టీలో ఉన్న నాయ‌ర‌కులు టీడీపీ-కాంగ్రెస్ దోస్తీని జీర్ణించుకోలేక మంత్రులు, ఎమ్మెల్యే ఎక్క‌డ‌క‌నిపిస్తే అక్క‌డ క‌డిగిపారేస్తున్నారు.
 
దీంతో టీడీపీ నేత‌లు ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క ఈ ప్ర‌శ్న‌ల‌ను దాట‌వేస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో హోం మంత్రి చినరాజ‌ప్ప‌కు ఇవే ప్ర‌శ్న‌లు ఎదురైయ్యాయి. తాజాగా ఆయ‌న ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అయితే రాష్ట్రానికి న్యాయం చేస్తార‌న్న ఉద్దేశంతో వారితో పొత్తుకుదుర్చుకున్నామ‌ని చిన‌రాజ‌ప్ప స్ప‌ష్టం చేశారు. 
 
గ‌తంలో బీజేపీతో పొత్తులో భాగంగా తాము మోస‌పోయామ‌ని అన్నారు అంతేకాదు రాష్ట్రం బాగుప‌డాలంటే కేంద్రంలో ఉన్న ఎవ‌రికో ఒక‌రికొ స‌హ‌క‌రించాల‌ని చిన‌రాజ‌ప్ప అన్నారు. బీజేపీ చేసిన‌ట్లే కాంగ్రెస్ కూడా రానున్న రోజుల్లో మోసం చేస్తే అంటూ విలేక‌ర్లు ప్ర‌శ్నించారు దీంతో మంత్రి స‌మాధానం చెప్ప‌లేక ఈ ప్ర‌శ్న‌ను దాట‌వేశారు.

 

షేర్ :

Comments

0 Comment