ఫిరాయింపుల‌కు షాక్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

defective mps
Updated:  2018-06-06 06:02:15

ఫిరాయింపుల‌కు షాక్ ?

ఉరుము ఉరిమి......మీద ప‌డ్డ‌డ్డు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు కూల్ గానే ఉన్నా.. ఇటు వైసీపీ నుంచి పార్టీ మారిన ముగ్గురు ఎంపీల ప‌రిస్దితి డైల‌మాలో ఉంది.గ‌తంలో అవిశ్వాసం పై వైసీపీ  విప్ జారీ చేస్తే ఎటువంటి ప‌రిస్దితి స‌భ‌లో ఎదురు అవుతుందో అని గ‌తంలో అస‌లు మీడియా కంటికి కూడా క‌నిపించ‌లేదు ఈ స‌దరు ఎంపీలు... ప్ర‌త్యేక హూదాకై అవిశ్వాస తీర్మానం బిల్లు ప్రవేశ‌పెట్టిన స‌మ‌యంలో వారి ఓటింగ్ ఎటువైపా అని అనుకుంటే, చివ‌ర‌కు బిల్లు చర్చ‌కు రాలేదు. దీంతో ఫిరాయింపులు ఊపిరి పీల్చుకున్నారు.
 
అయితే ఇప్పుడు పరిస్దితి పూర్తిగా మారింది స్పీక‌ర్ ఫార్మెట్లో ,త‌మ ఎంపీ ప‌ద‌వుల రాజీనామాలు ఆమోదించాల‌ని కోరిన వైసీపీ ఎంపీలు దూకుడుగా ఉన్నారు. త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు చేసిన రాజీనామాలు ఆమోదం చెందుతున్నాయి అని ఫిక్స్ అయ్యారు...పున‌రాలోచించుకోవాల‌ని త‌మ‌కు అవ‌కాశం ఇచ్చినంద‌కు కూడా లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.
 
అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ రాజీనామాలు ఆమోదించ‌రు అని అనుకుంటే? రాజీనామాలు ఆమోదించేలా సీన్ మారిపోయింది. దీంతో ఫిరాయింపు ఎంపీలు డైల‌మాలో ప‌డ్డారు... అలాగే ముగ్గురు  ఫిరాయింపు  ఎంపీల స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేయాల‌ని వైవీ - మేక‌పాటి కోరారు... దీంతో ఫిరాయింపు రాజ‌కీయం ఇక్క‌డ తిర‌కాసు ప‌డింది.. ఇప్ప‌టి వ‌ర‌కూ వారిపై చ‌ర్య‌లు తీసుకోలేదు.. ఓ వైపు బీజేపీతో టీడీపీ మైత్రిగా ఉంది కాబ‌ట్టి వారి రాజీనామాలు ఆమోదించ‌లేద‌ని అభిప్రాయాలు వ‌చ్చాయి.. ఇప్పుడు ఎన్డీయే నుంచి బయ‌ట‌కు వ‌చ్చింది తెలుగుదేశం, దీంతో రాజ‌కీయంగా ఎటువంటి ప‌రిస్దితి ఇప్పుడు ఇక్క‌డ వ‌స్తుందా అని ఇటు తెలుగుదేశం - వైసీపీ ఆలోచ‌న చేస్తోంది..
 
వైసీపీ  త‌ర‌పున గెలిచిన నంద్యాల ఎంపి ఎస్పివై రెడ్డి, అర‌కు ఎంపి కొత్త‌ప‌ల్లి గీత‌, క‌ర్నూలు ఎంపి బుట్టా రేణుక విడ‌త‌ల వారీగా టిడిపిలోకి ఫిరాయించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.. ఇటు పార్టీ మారి విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌క్క‌న పెడితే ఇప్పుడు రాజ‌కీయంగా చైర్మన్ స్పీక‌ర్ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటారు.. ఒక‌వేళ వేటు వేస్తే వీరితో పాటు క‌చ్చితంగా ఉప ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల్సిందే... న్యాయ‌ప‌రంగా వెళ్ల‌డానికి ఇదేమీ నేరుగా చేరిన ప‌రిణామం కాదు, వెనుక‌దారి నుంచి పార్టీ మారిన వ్య‌వ‌హారం. సో వీరి రాజ‌కీయం  కూడా భవిత‌వ్యంలో ప‌డింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.