ఎన్టీఆర్ కు షాక్ బాల‌య్య‌కు మ‌రో కొత్త ప‌ద‌వి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

balakrishna and jr ntr
Updated:  2018-09-04 12:34:35

ఎన్టీఆర్ కు షాక్ బాల‌య్య‌కు మ‌రో కొత్త ప‌ద‌వి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో నంద‌మూరి కుటుంబం మ‌ళ్లీ యాక్టివ్ గా మారుతోంద‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లంతా భావించారు. చిన్ని చిన్ని ఇబ్బందుల‌ను ప‌క్క‌న పెట్టి పార్టీ కోసం రాష్ట్రం కోసం పార్టీ ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ పూర్తిగా టీడీపీకి బ్యాక్ బోన్ గా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అనుకున్నారు. ఆ దిశ‌గా కుటంబ పెద్ద‌లు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే సంకేతాలు వ‌చ్చాయి. అయితే ఇంత‌లోనే హ‌రికృష్ణ హఠాన్మ‌ర‌ణంతో పార్టీ అభిమానుల‌ను  ప్ర‌త్యేకించి నంద‌మూరి ఫ్యాన్స్ ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింది. కొంత కాలంగా హ‌రికృష్ణ పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నా పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఆయ‌న‌ను కొన‌సాగించారు చంద్ర‌బాబు నాయుడు. 
 
అయితే ఇటీవ‌లే కొన్నిప‌రిణామాల‌ను విశ్లేశిస్తే నంద‌మూరి కుటుంబాన్ని పార్టీ ద‌గ్గ‌ర చేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు హ‌రికృష్ణ స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తిచేస్తార‌నేది చ‌ర్చ‌గా మారింది. అయితే హ‌రికృష్ణ స్థానాన్ని నంద‌మూరి కుటుంబంచేతే భ‌ర్తి చేయిస్తే బాగుంటుంద‌ని తెలుగుదేశం పార్టీలో కొంద‌రు అంటున్నారు. అయితే ఈ క్ర‌మంలోనే బాల‌కృష్ణ పేరు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. హ‌రికృష్ణ కొడుకు జూనియ‌ర్ ఎన్టీఆర్ 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేప‌ట్టినా ఆ త‌ర్వాత రాజ‌కీయాల జోలికి పెద్ద‌గా రాలేద‌నే చెప్పాలి.
 
పైగా తాను ఇప్పుడే రాజ‌కీయాల్లోకి రాన‌ని క‌నీసం 20 ఏళ్ల‌పాటు క‌ళా సేవ చేస్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. అందువ‌ల్ల హ‌రికృష్ణ స్థానాన్ని బాలకృష్ణ చే భ‌ర్తి చేయిస్తే బాగుంటుంద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. బాల‌య్య ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో క్రియాశీల‌క వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో పాటు హిందూపురం ఎమ్మెల్యేగా కూడా కొన‌సాగుతున్నందున అయ‌న్నే పొలిట్ బ్యూరోకు పంపితే నంద‌మూరి ఫ్యాన్స్ కూడా సంతోషిస్తార‌ని అంటున్నారు. 
 
పార్టీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే పొలిట్ బ్యూరోలో నంద‌మూరి కుటుంబం త‌ప్ప‌ని స‌రిగా ఉండాల‌ని, ఇది ప్ర‌తీ ఒక్క‌రు కోరుకుంటార‌ని భావిస్తున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో మ‌రో విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు మ‌రికొంద‌రు. బాల‌య్య ఎలాగో రాజ‌కీయాల్లో ఉన్నార‌ని నంద‌మూరి ఫ్యామిలీ టీడీపీ వెనుకే ఉంద‌నే సంకేతాలు మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటే హ‌రికృష్ణ స్థానాన్ని జూనియ‌ర్ ఎన్టీఆర్ తో భ‌ర్తి చేయిస్తే బాగుంటుంద‌ని త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 
 
అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల‌కే ఎక్కువ ప్ర‌ధాన్య‌త ఇస్తున్నందున ఇది ఎంత‌వ‌ర‌కు సాధ్యం అనే అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీలోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎప్పుడు అయినా రావ‌చ్చ‌ని వ‌స్తే ఆయ‌న‌కుండే ప్ర‌యార్టీని ఎవ్వ‌రూ కాద‌న‌లేర‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయ అరంగేట్రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాల‌ని అంటున్నారు. గతంలో చెప్పిన విధంగానే కొన్నాళ్లు సినిమాల‌కే పరిమితం అయి ఆ త‌ర్వాత‌ రాజ‌కీయ‌ల‌పై ఆలోచిద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నారా లేకా ఆయ‌న మ‌న‌స్సు ఏమైనా మారిందా అనే అంశాన్ని కూడా పార్టీ అధినాయ‌క‌త్వం తెలుసుకుని వాటికి అనుగునంగా నిర్ణ‌యాలు తీసుకోవాల‌నే సూచ‌న‌ల‌ను స‌ద‌రు నేతలు సూచిస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.