కోడెల‌కు ఊహించ‌ని షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 12:38:34

కోడెల‌కు ఊహించ‌ని షాక్

రాయ‌ల‌సీమ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. అధికారిక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స్పీకర్ కోడెల అనంత‌పురం జిల్లాకు వెళ్లారు. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా దీక్ష‌లు, ధ‌ర్నాల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది. రాయ‌ల‌సీమ‌లో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ సీమ‌లోని నాలుగు జిల్లాల్లో న్యాయ‌వాదులు, ప్ర‌జాసంఘాలు, విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.
 
ఇందులో భాగంగా అనంత‌పురంలో  స్పీక‌ర్ కోడెల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు న్యాయ‌వాదులు. శ్రీభాగ్ ఒప్పందం ప్ర‌కారం రాజ‌ధానిని ఒక‌చోట‌, హైకోర్టును మ‌రో చోట ఏర్పాటు చేయాల‌ని న్యాయ‌వాదులు స్పీక‌ర్ ను కోరారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు  అభివృద్దిని అమ‌రావ‌తికి మాత్రమే ప‌రిమితం చేసి రాయ‌ల‌సీమ‌కు అన్యాయం చేస్తున్నార‌ని వారు మండిప‌డ్డారు. 
 
ఓవైపు హైకోర్టును క‌ర్నూల్లో ఏర్పాటు చేయాల‌ని  రాయ‌ల‌సీమ‌లో ధ‌ర్నాలు నిర‌స‌న‌లు, దీక్ష‌లు జ‌రుగుతుంటే...మ‌రోవైపు ఏపీ స‌ర్కార్ మాత్రం హైకోర్టును అమ‌రావ‌తి ప్రాంతంలోనే ఏర్పాటు చేసేందుకు  వేగంగా స‌న్నాహాలు చేస్తోంది. దీంతో టీడీపీ ప్ర‌భుత్వంపై రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.