బోండా ఉమాకు షాక్ విజ‌య‌వాడ‌లో సంచ‌ల‌నం రేపుతున్న స‌ర్వే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-18 16:48:03

బోండా ఉమాకు షాక్ విజ‌య‌వాడ‌లో సంచ‌ల‌నం రేపుతున్న స‌ర్వే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇటు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, అటు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వేల‌ను నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా అధికార టీడీపీ నాయ‌కులు త‌మ ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న ఆధ్వ‌ర్యంలో కీల‌క స‌ర్వేల‌ను నిర్వ‌హించారు.
 
13జిల్లాల్లో నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో టీడీపీ ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌లు అసంతృప్తిగా ఉన్నార‌ని తేలింది. అంతే కాదు త‌మ నియోజ‌కవ‌ర్గంలో టీడీపీ నాయ‌కులను గెలిపిస్తే అభివృద్ది జ‌రుగుతుంద‌ని భావించి వారిని 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలిపించామ‌ని, కానీ ఇంత వ‌ర‌కూ టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్క‌చోట కూడా అభివృద్ది చేయ‌లేద‌ని అంటున్నారు. 
 
అయితే ముఖ్యంగా రాష్ట్రానికి రాజ‌ధానిగా ఉన్న విజ‌య‌వాడ‌లో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అయింది. తాజాగా విజ‌య‌వాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప‌ని తీరుపై, అలాగే ఆయన గురించి ప్రజలుఏమనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆయన మళ్లీ గెలుస్తారా..? అన్న ప్రశ్నలపై లగడపాటి రాజగోపాల్ ఆర్జీస్ ఫ్లాష్ టీమ్ సర్వే నిర్వ‌హించింది.
 
2014 లో టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత ఒక్క‌చోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేద‌ని తెలిపింది. దీంతో పాటు నాలుగేళ్లలో ఆయన భూ వివాదాల్లో చిక్కుకున్నారు. అనవసర వ్యవహారాల్లో తలదూర్చి వివాదాల్లో ఇరుక్కున్నారు.అలాగే చంద్ర‌బాబు నాయుడు పోయిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో సుమారు ఆరువంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించి ఇంత‌వ‌ర‌కు అవి నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌జ‌లు త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నార‌ని ఈ స‌ర్వేలో తేలింది.
 
ఇక ఫైన‌ల్ గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పరిపాన‌ల‌పై అలాగే విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండ ఉమా ప‌రిపాల‌న‌పై ఎన్నిమార్కులు వేస్తార‌ని ప్ర‌జ‌లను అడిగి తెలుసుకున్నారు. బోండా ఉమా నియోజ‌కవ‌ర్గ ప‌నితీరుపై ప్ర‌జ‌లు 33.5 శాతంమంది సంతృప్తిగా ఉన్నారు. అలాగే చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌పై 30.6 సంతృప్తి చెందార‌ని, మిగిలిన వారంద‌రు టీడీపీ ప‌రిపాల‌న‌లో అసంతృప్తిగానే ఉన్నార‌ని ఈ స‌ర్వేలో తేలింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.