టీడీపీకి షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-22 17:28:36

టీడీపీకి షాక్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రానున్న ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే..జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ సంక‌ల్ప యాత్ర‌కు అడుగ‌డుగునా  ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. ప్ర‌స్తుతం ఈ సంక‌ల్పయాత్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన గుంటూరు జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను, టీడీపీ అధికారంతో అక్ర‌మంగా దోచుకుంటున్న డబ్బును ప్ర‌జ‌లకు వివ‌రిస్తున్నారు జ‌గ‌న్.
 
2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, తెలుగు దేశం పార్టీలో ఫిరాయించారు కొంద‌రు ఎమ్మెల్యేలు,ప్ర‌స్తుత రాజ‌కీయాల బ‌ట్టీ, టీడీపీలోకి ఎందుకు ఫిరాయించామురా !! దేవుడా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు వారు... సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు తెలుపుతున్నమ‌ద్ద‌తును చూసి, ఇటు ఫిరాయింపుల‌తో పాటు అటు టీడీపీ నాయ‌కులు కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నారట‌... ఈ నేప‌థ్యంలో ప్ర‌తీ ఒక్క‌రు సైకిల్ ప్ర‌యాణం చేసి పూర్తిగా అల‌సిపోయామ‌ని, ఇక ఫ్యాన్ కింద కూర్చొని రెస్ట్ తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
 
అయితే తాజాగా ఈ వ‌రుస‌లో క‌ర్నూల్ జిల్లా బ‌న‌గాన‌పల్లె కు  చెందిన టీడీపీ ఎమ్మెల్యే బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి  ముందంజ‌లో ఉన్నారు అని నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు... ఆయ‌న స‌న్నిహితుల స‌మాచారం ప్ర‌కారం, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీకి గుడ్ బాయ్ చెప్పి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌రపున పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది... వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌న‌గానప‌ల్లె సెగ్మెంట్ త‌రపున సైకిల్ పార్టీ గెలిచే ప‌రిస్థితి క‌నిపించ‌కపోవ‌డంతో  బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి వైసీపీలోకి ఫిరాయించే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి చూడాలి పార్టీ ఫిరాయింపుల ఎఫెక్ట్, నేరుగా గెలిచిన వారి ఎఫెక్ట్ ఎలా ఉండ‌బోతోందో వ‌చ్చే ఎన్నిక‌ల్లో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.