భూమా ఫ్యామిలీకి షాక్ ఆళ్ల‌గ‌డ్డ టికెట్ క‌ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-16 13:25:03

భూమా ఫ్యామిలీకి షాక్ ఆళ్ల‌గ‌డ్డ టికెట్ క‌ట్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తరుణంలో  అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల సీట్ల కేటాయింపుల పై ఆ పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి పెద్ద‌త‌ల‌నొప్పిగా మారుతోందా అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.
 
ముఖ్యంగా రాయ‌ల‌సీమ క‌ర్నూల్ జిల్లా అసెంబ్లీ సీట్లపై అధిష్టానానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు లేని స‌మ‌యంలో ఆయ‌న కుమారుడు మంత్రి నారా లోకేశ్ క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించి 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్ధి ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి పోటీ చేస్తారని ఆయ‌న ప్ర‌క‌టించారు. దీంతో టీడీపీ నాయ‌కులు టీజీ వెంక‌టేష్ అల‌క చెందారు. ఇక మ‌రోవైపు నంద్యాల ఆళ్ల‌గడ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.
 
ఈ రెండు సీట్ల‌పై ఇద్ద‌రు టీడీపీ నాయ‌కులు ఎస‌రు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్య‌క్తుల‌కు సీట్లు ఇవ్వ‌డం కుద‌ర‌దు అని టీడీపీ అధిష్టానం స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. అందులో ఎస్వీ మోహ‌న్ రెడ్డి ముందు చూపుతో ఆలోచించి త‌న సీటును క‌న్ఫామ్ చేసుకున్నారు. ఇక మిగిలింది నంద్యాల, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేలు, భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి, అఖిల ప్రియ వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు సీటు వ‌దులు కోవాల్సి వ‌స్తోందని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. 
 
తాజా విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఆలోచిస్తే భూమా ఫ్యామిలీ చ‌రిత్ర‌ను ఒక్క‌సారి ఆలోచిస్తే గతంలో భూమా శేఖర్‌రెడ్డి మరణిస్తే నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని, భూమా నాగిరెడ్డి మరణించడంతో శేఖర్‌రెడ్డి కుమారుడికి ఇవ్వడమే సరైందనే వాదన తీసుకొచ్చారు. కానీ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం త‌ల్లి దండ్రులు లేని పిల్ల‌ల‌ని భావించి సెంటిమెంట్ ను ప్ర‌యోగించింది. అయితే 2019 ఎన్నిక‌ల‌కు ఈ సెంటిమెంట్ వ‌ర్తించేలా క‌నిపించ‌డంలేదు. 
 
ఇటు నంద్యాల‌ సీటుపై ఎస్పీవై రెడ్డి పాగా వేస్తుంటే అటు ఆళ్ల‌గడ్డ సీటుపై వైవీ సుబ్బారెడ్డి పాగా వేస్తున్నారు. ఇక వీరి పాగా కూడా టీడీపీ అధిష్టానం సుముఖంగా ఉంద‌నే చెప్పాలి. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్య‌క్తుల‌కు సీట్లు ఇవ్వ‌డంపై టీడీపీ నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌టంలేదు. దీంతో ప‌రోక్షంగా టీడీపీ నాయ‌కులు భూమా ఫ్యామిలీపై గుర్రుగా ఉన్నారు. నంద్యాల‌, ఆళ్ల‌గడ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి భూమా ఫామిలీకి చెందిన వారు ఎవ‌రో ఒక‌రు 2019లో పోటీ చేయ్యాలి. అది బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి కావ‌చ్చు, లేక మంత్రి అఖిల ప్రియ అయినా కావ‌చ్చు. 
 
వాస్త‌వంగా చూసిన‌ట్లు అయితే భూమా ఫ్యామిలీ చ‌రిత్ర‌ను దృష్టిలో ఉంచుక‌న్న‌ట్లు అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నంద్యాల నుంచి బ్ర‌హ్మానంద‌రెడ్డి పోటీ చేయ్యాలి, కానీ చ‌రిత్ర‌ను కాద‌నుకుంటే ఆళ్ల‌గ‌డ్డ‌లో మంత్రి అఖిల ప్రియ పోటీ చేయ్యాలి చూద్దాం ఏ జ‌రుగుతుందో, వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమా ఫ్యామిలీ నుంచి ఎవ్వ‌రు పోటీ చేస్తారో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.