వారి నోట్లో వాళ్ళే మట్టి కొట్టుకున్నంత పనైందిగా.. టీడీపీ కి సిట్ భారీ షాక్..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-09 04:53:17

వారి నోట్లో వాళ్ళే మట్టి కొట్టుకున్నంత పనైందిగా.. టీడీపీ కి సిట్ భారీ షాక్..

అతి తొందరపాటుకు నిదర్శనంగా టీడీపీ నేతలు నిలుస్తున్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేసి వారికి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు..అది వారికి పిడిగుద్దులుగా మారుతున్నా వారి వైఖరి మారట్లేదు. ఈ రకమైన శిక్షణ అప్పట్లో హిట్ అయినా ఇటీవల కాలంలో పనిచేయడంలేదు.. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం చివరికి నాలిక కరచుకోవాల్సివస్తోంది. అసలు విషయం ఏంటంటే విశాఖ జిల్లా ఏజెన్సీకి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు దారుణంగా హత్య గావించబడ్డ సంగతి అందరికి తెలిసిందే.. దీన్ని అంతా ఖండించారు.

అయితే ఈ హత్యల విషాదం ఇలా ఉండగానే టీదీపీ మరో వైపు రాజకీయం మొదలెట్టేశారు. ఈ హత్యల వెనక వైసీపీ నేతలు ఉన్నారని ప్రచారం స్టార్ట్ చేశారు. విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణెష్ కుమార్ అయితే జగన్ హస్తం ఉందన్న వరకూ వెళ్ళారు.ఈ హత్యల తరువాత చంద్రబాబు ప్రభుత్వం సీనియర్ అధికారి ఫకీరప్ప నాయకత్వంలో విచారణ కమిటీ ని ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్త్ జరిపించింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దాంతో ఖంగు తినడం ఆరోపణలు చేసిన టీడీపీ పెద్దల వంతైంది.హత్యల వెనక ఉన్నది టీడీపీ నేతలేనని పోలీసుల విచరణలో వెల్లడైంది. 

ఆ పార్టీకి చెందిన అరకు తూటంగా గా పంచాయతి ఎంపీటీసి ఏదుల సుబ్బారావు, ఆయన భార్య లక్ష్మి, టీడీపీ నాయకుడు శోభన్, అతని మేనత్త కోమల ఈ హత్యకు ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చేశారు. అయితే ఇపుడు విచారణ పూర్తి అయినా బయట పెట్టకుండా పోలీసులు ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు. బయట పెడితే అధికార పార్టీ హస్తం ఉందని వెల్లడవుతుంది. దాంతో వైసీపీ పై చేసిన ఆరోపణలు తప్పని తేలిపోయి మొత్తం పరువు పోతుంది. దాంతో పోలీసులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారని భోగట్టా. ఇప్పటికి పదిహేను రోజులు పైదాటింది, అయినా అసలు బాధ్యులు ఎవరో బయటకు వెల్లడించకపోవడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.