గ‌వ‌ర్న‌ర్ పై శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్యలు....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sivaji sensational comments on governor narasimhan
Updated:  2018-03-02 11:42:29

గ‌వ‌ర్న‌ర్ పై శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్యలు....

విప‌క్ష ప్రతిప‌క్ష నాయ‌కులు విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకోవ‌డం చూస్తూనే ఉంటాం.. అయితే ఇప్పుడు ప్ర‌త్యేక హూదా అంశం ఏపీలో రాజ‌కీయ పార్టీల పై ప‌లు విమ‌ర్శ‌ల‌కు కూడా దారితీస్తోంది... కేంద్రం ద‌గ్గ‌ర తెలుగుదేశం మోక‌రిల్లింద‌ని, ఓటుకునోటు కేసు వంటి కేసుల వ‌ల్ల ఏపీకి కేంద్రం ప్ర‌త్యేక హూదా ప్ర‌క‌టించ‌డం లేదు అనే విమ‌ర్శ‌లు ఎదుర్కుంటోంది.. కేంద్రం ఏపీకి ఎందుకు సాయం చేయ‌డం లేదు అని వైసీపీ ప్ర‌శ్నిస్తోంది.. ఇటు నిజానిజాలు వాస్త‌వాలు తెలియ‌చేస్తాను అంటూ ప‌వ‌న్ జేఎఫ్ సీ ప్ర‌క‌టించారు.. ఇటు బీజేపీ ఎన్ని నిధులు ఏపీకి ఇచ్చినా కేంద్రానికి గుర్తింపు రావ‌డం లేద‌ని వాపోతున్నారు.. అయితే త‌మిళ‌నాడులో క‌లిసిక‌ట్టుగా సినీ ప‌రిశ్ర‌మ ఏ విష‌యంలోనైనా ముందుకు వ‌స్తుంది.. అలా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఏ విష‌యంలోనూ మందుకు రాదు అనే విమ‌ర్శ ఉంది.
 
ఇక ఏపీలో కాస్తో కూస్తో న‌టుడు శివాజీ ఏపీకి ప్ర‌త్యేక హూదా కావాలి అంటూ గొంతెత్తుతున్నారు.. ఆ గొంతెను పైకి రాకుండా కొన్ని మీడియాలు అడ్డుకుంటున్నాయి అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయినా శివాజీ త‌న పందాని చూపుతున్నారు.. ఏపీకి న్యాయంచేయాలి అంటూ ఎక్క‌డ ప్ర‌త్యేక హూదా ఉద్యమం జరిగినా పాల్గొంటున్నారు.. ఇటీవ‌ల బీజేపీ నాయ‌కులు కూడా అతనిపై దాడికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే.
 
తాజాగా ఆయ‌న గ‌వ‌ర్నర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు..ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్‌ నరసింహన్‌ అని సినీ హీరో శివాజీ  విమ‌ర్శ‌లు చేశారు. గుంటూరు లో జ‌రిగిన ప్ర‌త్యేక హూదా విభ‌జ‌న హామీల సాధ‌న స‌మితి స‌ద‌స్సులో ఆయ‌న ప్ర‌సంగించారు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి గవర్నర్‌ రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు... 
 
అలాగే మనకంటే ముందు 25 మంది పార్లమెంటు సభ్యులు పోరాడాలని, ఎంపీలు తమ స్వార్థం కోసం నాటకాలాడుతున్నారని.. పార్లమెంటు జరగకుండా చేస్తే సగం విజయం సాధించినట్లేనని శివాజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెట్టి వెంక య్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారని, మన రాష్ట్రానికి సంబంధించి ఏమడిగినా వెంకయ్య నాయుడికి కోపం వస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక హోదా లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరని శివాజీ అన్నారు. అయితే కాస్త దేశంలో అత్యున్న‌త ప‌ద‌వుల్లో ఉన్న‌వారిపై నోటి దురుసు ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌ని, శాంతిగా త‌మ భావాలు-  డిమాండ్లు కోరి సాధించుకోవాలి అని సూచిస్తున్నారు మేధావులు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.