చిన్నారి లేఖ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 17:14:33

చిన్నారి లేఖ

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రకు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ సంక‌ల్ప‌యాత్ర‌ ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ కంచుకోట కృష్ణా జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారో అక్కడ టీడీపీ నేత‌ల‌ను, ఎమ్మెల్యేల‌ను మొదలుకుని ప్రజా సమస్యల‌పై సీఎం చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు జగన్.
 
అలాగే పాద‌యాత్ర‌లో చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు జ‌గ‌న్. టీడీపీ ప‌రిపాల‌న‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బాగుప‌డుతున్నారు త‌ప్ప ప్ర‌జ‌లు బాగుప‌డ‌లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తీర్చే వారే నాయ‌కులని అధికారంతో సొంత‌ అవ‌స‌రాలు తీర్చుకునే వారు నాయ‌కులు కార‌ని విమ‌ర్శించారు. అయితే వీట‌న్నింటికి స్వ‌స్తి చెప్పే రోజులు ద‌గ్గ‌ర‌లో ఉన్నాయ‌ని అన్నారు.  2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే చంద్ర‌బాబు మొద‌లుకుని ఆయ‌న కాంట్రాక్ట‌ర్ల  వ‌ర‌కూ ఎవ‌రెవ‌రు అవినీతికి పాల్ప‌డ్డారో వారంద‌రిని ఎక్క‌డ బొక్క‌లో పెట్టాలో అక్క‌డ పెడ‌తామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ చిన్నారి జ‌గ‌న్  మీద త‌న‌కున్నఅభిమానంతో ఒక లేఖ రాసింది... ఈ చిన్నారి రాసిన లేఖలో ఏం ఉందంటే  స్వాగతం సుస్వాగతం జగనన్నకి. మీ అమ్మ ఒడి పథకం చాలా బాగుంది. మా ఇల్లు పూరిల్లు. పూరిల్లుని డాబాలు చేయమని కోరుకుంటున్నాం. 2000 ఫించన్‌ వృద్దులకు ఇవ్వడం మంచిది. రాష్ట్రంలో అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. ఆడపిల్లల్ని పెద్దన్నలాగా కాపాడుతావని కోరుకుంటున్నాం అని రాసింది. అయితే ఈ  చిట్టితల్లి రాసిన చిట్టి లేఖ‌ను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న సోషల్‌ మీడియా అకౌంట్ లో పంచుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.