2019 ఎన్నికల్లో సోషల్ మీడియాదే హవా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-24 15:26:54

2019 ఎన్నికల్లో సోషల్ మీడియాదే హవా

2014 ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా వాడుకొని, జనాభిప్రాయాన్ని మార్చి దేశం మొత్తం బీజేపీ హవా నడిచేటట్టు చేసి, ప్రధాని పీఠాన్ని అధిష్టించింది...బీజేపీకి సోషల్ మీడియా ప్రభావం గురించి తెలుసు.అందుకే దేశంలోనే బీజేపీ సోషల్ మీడియాలో నెంబర్ వన్ గా దూసుకెళ్తుంది...అందుకే వచ్చే ఎన్నికలలో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుందో అని సర్వే చేసింది బీజేపీ ఐటీ టీం...సోషల్ మీడియా దేశవ్యాప్తంగా సుమారు 17 శాతం ఓటర్లని ప్రభావితం చేస్తుందని ఈ సర్వేలో తేలిందట.
 
ఒక అబద్దాన్ని అయినా, నిజాన్ని అయినా ఒకే విషయాన్ని పది మంది, పది రకాలుగా విశ్లేషించి చెప్పగలిగితే అబద్దం నిజంగా, నిజం అబద్దంగా మారుతుంది.ఇదే విషయాన్ని చాల రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. మీడియాను తన చేతుల్లో పెట్టుకొని ఇలా ప్రచారం చేపించడం ద్వారా నిజానైనా, అబద్దానైనా ప్రజల మదిలో నాటుకునేలా చేసి లబ్ది పొందుతున్నాయి రాజకీయ పార్టీలు.
 
కానీ ఇప్పుడు మీడియాతో సమానంగా సోషల్ మీడియా హవా కూడా పెరిగింది.. అందుకే  అన్ని పార్టీలు సోషల్ మీడియాలో తన హవాను పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి...పార్టీ మీద అభిమానంతో కొందరు వాలంటీర్ గా పని చేస్తుంటే, కొన్ని పార్టీలు పెయిడ్ వర్కర్లను తీసుకుని తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
ఇక ఏపీ విషయానికి వస్తే మీడియా మొత్తం అధికార పార్టీకి అండగా ఉంటూ, టీడీపీకి అనుకూల మీడియాగా పేరు తెచ్చుకుంది. కానీ టీడీపీకి సోషల్ మీడియాలో పట్టులేదు... అందుకే సోషల్ మీడియాలో కూడా తన హవాని పెంచుకునేందుకు సుమారు 1000మంది పెయిడ్ వర్కర్లను తీసుకుంది టీడీపీ...ప్రతిపక్ష పార్టీ విషయానికి వస్తే మీడియాలో తనకు పట్టు లేదు...దీంతో ఆ పార్టీ సోషల్ మీడియాపై దృష్టి సారించింది. ఇప్పుడు  దేశంలోనే వైసీపీ సోషల్ మీడియాలో ముందు వరుసలో దూసుకుపోతుంది... ఏపీలో లో 2019 ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.