న‌డిరోడ్డు పై సోమిరెడ్డి ప‌రువుతీసిన టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

somi reddy
Updated:  2018-08-08 05:23:38

న‌డిరోడ్డు పై సోమిరెడ్డి ప‌రువుతీసిన టీడీపీ

2014 సార్వ‌త్రిక ఎన్నికల్లో సుమారు ఆరువంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌జ‌ల‌కు ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చిన తెలుగు దేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇంత‌వ‌ర‌కు ఒక్క హామీను కూడా స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌లేదు. ఇక ఇప్పుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుస్తున్న త‌రుణంలో టీడీపీ నాయ‌కులు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో విసృతంగా ప‌ర్య‌టిస్తూ మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని చూస్తున్నారు. 
 
ఇక ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా  తెలుగు త‌మ్ముళ్లు గ్రామ ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి అవుతున్నారు. ఈ ముఖాముఖిలో  సాధార‌ణ ప్ర‌జ‌లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక పోతున్నారు టీడీపీ నాయ‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో అనేక హామీల‌ను ప్ర‌క‌టించిన మీరు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌జ‌లు భ‌హిరంగంగానే ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో టీడీపీ నాయ‌కులు వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సమాధానం చెప్ప‌లేక పోతున్నారు. 
 
అయితే ఇలాంటి సంఘ‌ట‌నే మ‌రోసారి వైసీపీ కంచుకోట క‌డ‌ప జిల్లాలో చోటు చేసుకుంది. టీడీపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి రామాపురం గ్రామంలో రైతుల‌తో ముఖాముఖి అయ్యారు. ఈ ముఖాముఖిలో సోమిరెడ్డికి చేదు అనుభ‌వం ఎదురు అయింది. 
 
ఈ  కార్య‌క్ర‌మంలో హాజ‌రు అయిన రైతు మాట్లాడుతూ 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రుణ‌మాఫి చేస్తార‌న్నందుకు తాను టీడీపీకి ఓటు వేశాన‌ని, కానీ టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు అయినా కూడా ఇంత‌వ‌ర‌కు త‌న‌కు రుణ‌మాఫీ కాలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇక ఆయ‌న అడిన ప్ర‌శ్న‌కు మంత్రి సోమిరెడ్డి స‌మాధానం ఇస్తూ వ‌చ్చే ఎనిమిది నెల‌ల్లో రుణ‌మాఫీ 4,5 విడుత‌లు జ‌రుగుతాయ‌ని హామీ ఇచ్చారు. దీంతో ఆ రైతు శాంతించారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.