ప‌వ‌న్ పై సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-16 13:11:27

ప‌వ‌న్ పై సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

జనసేన పార్టీ ఆవిర్బావ దినోత్స‌వ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన ఆ పార్టీ  అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, ప్లీన‌రీలో  టీడీపీ పై తీవ్ర విమర్శలు చేసిన విష‌యం అంద‌రికి తెలిసిందే.. అయితే వాటికి స‌మాధానంగా టీడీపీ నాయ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీ వ్యవసాయ శాఖ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పవన్‌పై ఘాటు ప‌ద‌జాలంతో విరుచుకుపడ్డారు. ఆయన  విలేకరులతో మాట్లాడుతూ సినిమాలో మొద‌టి భాగంలో హీరోగా ఉండి,  రెండో భాగంలో విల‌న్ పాత్ర‌ పోషించినట్లుగా పవన్‌వ్యవహరిస్తున్నాడ‌ని అన్నారు. పవన్‌ తన మనసు ఎవరిమీద అయినా పారేసుకుంటాడు. ఆ తర్వాత మూడు, నాలుగేళ్లకు ఆరేసుకుంటాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత ఆ పార్టీని ఆరేసుకున్నాడు.  
 
ప్ర‌త్యేక‌హోదా కోసం, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాడతానన్న పవన్‌, ఒక్కసారిగా పన్నీర్‌ సెల్వంలా ఎందుకు మారిపోయారో అర్థం కావడం లేదని అన్నారు. వామపక్ష భావజాలంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అత‌ను ఉన్న ప‌ళంగా పక్షపాత భావజాలానికి చేరుకున్నాడ‌ని విమ‌ర్శించారు. మోదీని విమర్శించే ధైర్యం లేక ఒక్క టీడీపీనే టార్గెట్‌ చేయడం దేనికి సంకేతం అని అన్నారు. 
 
ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచుతామన్న కేసీఆర్‌ను పొగుడుతున్న పవన్‌...కాపు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన చంద్రబాబును విమర్శించడమేంటి?. ఎన్సీఏఈఆర్‌ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఐప్లెడ్ ఎకనామిక్ రిసెర్చ్) నివేదిక ప్రకారం ఏపీ  19వ స్థానంలో ఉంది. ఇదే నివేదిక ప్రకారం గతంలో ఏపీ ఒకటో స్థానంలో ఉంది.
 
ప‌రిపాల‌న‌లో జరిగిన ఒకటి, రెండు త‌ప్పుల‌ను ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తున్నారంటూ విమర్శలు చేయడం సరికాదు.  మంగళగిరిలో పవన్‌ ఇంటి నిర్మాణం జరిగే చోట నేనూ ఇల్లు తీసుకుందామంటే ఆరేడు కోట్లు రూపాయలు ఖర్చు అవుతుందని ఆయ‌న తెలిపారు.. అయితే  పవన్‌కు రెండు ఎక‌రాల‌ను రూ.40 లక్షలకే ఇచ్చేశారు. సినిమా హీరో మీద మోజుతో తక్కువ రేటుకు ఇచ్చారేమో?. కాపుల విషయంలో మీరేమన్నా అధ్యయనం చేశారా?. కాపు రిజర్వేషన్లు వద్దని చెప్పడమేనా మీ అధ్యయనం?. చంద్రబాబు, లోకేశ్‌ను విమర్శంచడానికేనా ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ? అంటూ ధ్వజమెత్తారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.