సోమీరెడ్డి ఏంటి ఆ మాట‌లు..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

somi reddy
Updated:  2018-08-20 04:19:55

సోమీరెడ్డి ఏంటి ఆ మాట‌లు..?

గ‌త కొద్దికాలంగా తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇంత‌కుముందే తిరుమ‌ల తిరుప‌తి దేవాలయంలో పింక్ డైమండ్ పోయింద‌ని ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఇక వారు చేసిన ఫిర్యాదుల‌పై మంత్రి సోమిరెడ్డి స్పందిస్తూ నోటికి ఏదివ‌స్తే అది మాట్లాడారు. విమ‌ర్శ‌లు చేస్తూ బొక్క‌లో వేసి వారిని నాలుగు తంతే అన్ని స‌ర్ధుకుంటాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఈ వ్యాఖ్య‌లు రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌రువ‌క ముందే మ‌రోసారి సోమిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా క‌ర్నూల్ జిల్లా జెడ్పి మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు రుణ‌మాఫీ గ్రీవెన్స్ సెల్ లో పాల్గొని ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏకంగా సోమిరెడ్డి దేశానికి అన్నంపెట్టే రైత‌న్న‌ల‌ను పారిశ్రామిక వేత్త‌ల‌తో పోల్చారు. కేవ‌లం ల‌క్ష‌రూపాలు తీసుకున్న రైతులు ఎందుకు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారో త‌న‌కు అర్థం కాలేద‌ని అన్నారు. వేల కోట్లు రూపాయ‌ల‌ను బ్యాంకుల్లో తీసుకుని వాటిని ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోతున్న పారిశ్రామిక వేత్త‌లు ఎందుకు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోలేద‌ని ఆర్థిక ఇబ్బందులతో బాద‌ప‌డుతున్న రైతుల‌ను చుల‌క‌న‌గా చేసి మాట్లాడారు సోమిరెడ్డి. 
 
ఇప్ప‌టికే రుణ‌మాఫీ కింద 9 ల‌క్ష‌ల ఫిర్యాదు