సోమిరెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-02 11:00:31

సోమిరెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలుగుదేశం క‌ళ్లు తెరిచింది... వైసీపీ కాస్త ఆచితూచి అడుగులు వేయాల‌ని ఆలోచిస్తోంది... బీజేపీ హుషారుగా ఉంది.. తాజాగా బీజేపీ స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన వార్షిక బ‌డ్జెట్ తో అసంతృప్తి పెక్కుమీరి తెలుగుదేశం వార్ కు రెడీ అవుతోంది ఓ ప‌క్క‌న ఎంపీలు ఈ బ‌డ్జెట్ పై పెద‌వి విరిచారు, వైసీపీ కూడా దేశీయంగా బాగుంది కాని రాష్ట్రానికి ఎటువంటి ప్ర‌యోజితంగా లేదు అని తేల్చేశారు.
 
అయితే సీఎం చంద్ర‌బాబు నేత‌ల‌కు కూడా ముందుగానే తెలియ‌చేశారు.. బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని మాత్రమే చెప్పండి రాజీనామాలు, బహిష్కరణలపై ప్రకటనలు వద్దు అని ఎంపీలు, మంత్రులకు సీఎం చంద్రబాబు తెలియ‌చేశారు.. అయితే మంత్రి సోమిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఏపీ తెలుగుదేశం నాయ‌కుల‌కు హుషారు తెప్పించాయి.. ఇటు బీజేపీని ఆలోచ‌న‌లో ప‌డేశాయి. అయితే సీఎం దీనిపై ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండానే సోమిరెడ్డి ఓ స్టెట్ మెంట్ ఇచ్చారు... ఒక‌టి రెండు రోజుల్లో నిర్ణ‌యాలు ఉంటాయి అని చెప్పారు.
 
బ‌డ్జెట్ లో తాము ఊహించిన దాని కంటే ఇప్పుడు మ‌రింత త‌క్కువ కేటాయింపులు ఏపీకి వ‌చ్చాయి అని ఫైర్ అయ్యారు సోమిరెడ్డి.... ఇక రాజ‌ధానికి సైతం నిధులు ఇవ్వ‌లేద‌ని సోమిరెడ్డి కేంద్రం తీరును ఆక్షేపించారు... అయితే మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి  చేసిన కామెంట్ తో ఇప్పుడు బాబుగారు బీజేపీకి క‌టీఫ్ చెబుతారా లేక అలెయెన్స్ నుంచి ప‌క్క‌కు వ‌స్తారా, లేక న‌మస్కారం పెట్టి త‌ప్పుకుంటారా అనేది రెండు రోజుల్లో తేల‌నుంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.