సీమ‌కు సోమిరెడ్డి అతి పెద్ద హామి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 01:22:41

సీమ‌కు సోమిరెడ్డి అతి పెద్ద హామి

రాయ‌ల‌సీమ‌లో హైకోర్టును ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా న్యాయ‌వాదులు దీక్ష చేస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. కర్నూల్ నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద  జ‌రుగుతున్న‌ ఈ దీక్షకు పెద్ద ఏత్తున ప్ర‌జ‌లు, విద్యార్థులు, ఉద్య‌మ‌కారులు సంఘీభావం తెలుపుతున్నారు. రాయ‌ల‌సీమ‌లో హైకోర్టును ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల  క‌రవుతో ఉన్న‌ ఈ ప్రాంత ప్ర‌జ‌లకు కొంత ఉప‌స‌మ‌నం క‌లుగుతుంద‌ని రాయ‌ల‌సీమ వాదులు తెలియ‌చేశారు.
 
తాజాగా కర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ మంత్రి సోమిరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కే.ఈ ప్రభాకర్‌తో క‌లిసి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్ష‌లో మాట్లాడిన మంత్రి సోమిరెడ్డి రాయ‌ల‌సీమ‌లో హైకోర్టును ఏర్పాటు చేయాల‌న్న మీ డిమాండ్‌ను, సిఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్లి సానుకూల స్పంద‌న వ‌చ్చేలా కృషి చేస్తాన‌ని హామి ఇచ్చారు.
 
మరోవైపు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఉన్న మంత్రి సోమిరెడ్డిని క‌ల‌వ‌డానికి న్యాయ‌వాదులు ప్ర‌య‌త్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి... మంత్రిని కలవాలంటూ న్యాయ‌వాదులు గ‌ట్టిగా నినాదాలు చేయడంతో, కోంద‌రిని అనుమ‌తించారు పోలీసులు. దీంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ఓట్ల కోసం టీడీపీ నాట‌కాలాడుతుందంటూ  న్యాయ‌వాదులు విమ‌ర్శించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.