నేను ఆ హీరోయినున్ గాఢంగా ప్రేమించాను

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-27 17:33:33

నేను ఆ హీరోయినున్ గాఢంగా ప్రేమించాను

ఇటీవ‌లే నెల్లూరు జిల్లాలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అసోసియేష‌న్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా అధికార తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, అలాగే అల‌నాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీ హాజ‌రయ్యారు.
 
జిల్లాలో ఇలాంటి కార్య‌క్ర‌మాలు జ‌రగడం ఇందుకు ప్ర‌ముఖులు హాజ‌రు కావ‌డం స‌ర్వ సాధార‌ణం అనుకుంటే ప‌ప్పులో కాలు వేసిన‌ట్లే. వాణిశ్రీ ఆ స‌మావేశానికి హాజ‌రు కాగానే మంత్రి సోమిరెడ్డి తాను చ‌దువుకునే స‌మ‌యంలో త‌న టీనేజ్ ల‌వ్ స్టోరీని స‌భా ముఖంగా వివ‌రించారు. దీంతో న‌టి వాణి శ్రీ న‌వ్వుకున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాను చ‌దువుకునే రోజుల్లో వాణిశ్రీకి వీరాభిమానిన‌ని చెప్ప‌రు.అప్ప‌ట్లో  వాణీ శ్రీ న‌టించిన ప్ర‌తీ సినిమాని మిస్ కాకుండా చూసేవాన్న‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు ఆమె సినిమాల‌ను చూసి చూసి ఆమె మీద అభిమానం పెరిగి త‌న‌కు తెలియ‌కుండానే ప్రేమ‌లో ప‌డ్డాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మంత్రి. 
 
అప్ప‌ట్లో వ‌చ్చిన ప్రేమ్ న‌గ‌ర్ సినిమా నెల్లూరు జిల్లాలో 116 రోజులు ఆడిందని ఈ 116 రోజుల్లో తాను మొత్తం 70 సార్లు ఈ సినిమాను చూశాన‌ని తెలిపారు. ఈ సిన‌మాను తాను కేవ‌లం వాణిశ్రీ కోస‌మే చూశాన‌ని స్ప‌ష్టం చేశారు సోమిరెడ్డి. త‌న మ‌న‌సులో ఉన్న వీరాభిమానాన్ని, ప్రేమను స‌భాముఖంగా చెప్ప‌డంతో వేదిక‌పై ఉన్న వాణి శ్రీ న‌వ్వుతూ క‌నిపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.