జ‌గ‌న్ పై సోమువీర్రాజు కొత్త మార్క్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-10 12:09:26

జ‌గ‌న్ పై సోమువీర్రాజు కొత్త మార్క్

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ కేంద్రంలో మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీతో క‌లిసి ఉన్న సంగ‌తి తెలిసిందే.. అయితే ఏపీలో జ‌రుగుతున్న అక్ర‌మాలు, అన్యాయాలు, లోపాల‌ను ఎత్తిచూపుతున్నారు క‌మ‌లం పార్టీ నాయ‌కులు.. తెలుగుదేశం నాయ‌కులు చేస్తున్న‌టు వంటి అక్ర‌మాల‌పై వారు గొంతెత్తి తెలుపుతున్నారు.. అయితే  ఇలా ఎలుగెత్తిచాటే నాయ‌కుల పై  తెలుగుదేశం నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అందులో ప్ర‌ముఖంగా వినిపించే పేరు బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజుది.. ఆయ‌న పై  తెలుగుదేశం నాయ‌కులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఫైర్ అవుతున్నారు. దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నం నుంచి ఇంటి పై దాడుల వ‌ర‌కూ ముందుకు వెళుతున్నారు.
 
ఇక తాజాగా ఆయ‌న వైసీపీ గురించి త‌నకు జ‌గ‌న్ కు మిత్ర‌బంధం ఉంది అని వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై  క్లారిటీ ఇచ్చారు.. త‌న‌ని అమిత్ షా మంద‌లించార‌ని ఏపీ నాయ‌కులు  బుజ్జ‌గించార‌ని వ‌స్తున్న విమ‌ర్శ‌లు అన్ని అవాస్త‌వం అని అన్నారు ఆయ‌న‌. కావాల‌నే కొన్ని ప‌త్రిక‌లు కొంద‌రికి సాయం చేయ‌డానికి త‌న‌ని డీ గ్రేడ్ చేస్తున్నాయి అని, కావాలి అంటే నా కాల్ డేటా ప‌రిశీలించుకోవ‌చ్చు అని స‌వాల్ చేశారు సోమువీర్రాజు. 
 
న‌న్ను వైయ‌స్సార్ సీపీ కోవ‌ర్టు అంటుంటే న‌వ్వు వ‌స్తోంది అన్నారు.. తాను రెండెక‌రాల నుంచి రెండు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ చేసిన కామెంట్లు చంద్ర‌బాబుని ఉద్దేశించి చేసిన‌వి కావ‌ని అన్నారు సోమువీర్రాజు.. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన ద్వారా జేఏసీ ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్ల‌డం మంచిది అన్నారు ఆయ‌న‌.
 
కావాల‌ని కొంద‌రు నా గొంతు నొక్కేందుకు ప్ర‌యత్నిస్తున్నారు అని అన్నారు ఆయ‌న‌.. ఇక ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ నాయ‌కుల‌తో తెలుగుదేశం నాయ‌కులు ఎందుకే భేటీ అవుతున్నారు, అలాంటి వారితో క‌లిసి ముందుకు న‌డ‌వాలి అని అనుకుంటున్నారా అని ఆయ‌న విమ‌ర్శించారు.. నా ఊపిరి ఉన్నంత వరకూ జాతీయవాద రాజకీయాల గురించే మాట్లాడతా అన్నారు.. బడ్జెట్‌ కాపీలు నాలుగు రోజుల ముందే మంత్రులకు వెళతాయి. మరి వాటిని కేంద్రమంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి చూడలేదా?.  అని ప్ర‌శ్నించారు... తాను జ‌గ‌న్ కు వైసీపీకి స‌పోర్ట్ కాద‌ని ఇక్క‌డ జ‌రుగుతున్న త‌ప్పులు మాత్ర‌మే చెబుతున్నా అని అన్నారు.. ఏపీ అభివృద్దికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని బీజేపీ న్యాయం చేస్తోంద‌ని, నిధులు ఇస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.