గుడ్డ‌లిప్పి కొడ‌తారా ....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-06 11:06:12

గుడ్డ‌లిప్పి కొడ‌తారా ....

తెలుగుదేశానికి బీజేపీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.. ఇంకా కేంద్రం తో తెలుగుదేశం ఫైట్ చేస్తూనే ఉంది... ఇక తెలుగుదేశం బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్దం మ‌రింత పెరిగింది అనే చెప్పాలి.. ఇప్పుడు తాజాగా ఈ రెండు పార్టీ ల మ‌ధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుంది.
 
విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బీజేపీ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీని కించపరిచే చర్యలను టీడీపీ మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్‌ రాజు, మాధవ్  మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతలు ఎక్కువ చేస్తే వాళ్ల అవినీతిపై నిలదీయాల్సి వస్తుందని హెచ్చరించారు.
 
చంద్రబాబుకు అమిత్‌ షా ఫోన్‌ చేయడాన్ని టీడీపీ నేతలు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు సహా ఎవరికీ బీజేపీ భయపడదని వ్యాఖ్యలు చేశారు. అస‌లు బీజేపీని భ‌య‌పెట్టే అంత సీన్ తెలుగుదేశానికి లేదు అని అన్నారు.. మీ అవినీతి చిట్టాల బండారం బ‌య‌ట‌పెడ‌తామ‌ని అన్నారు బీజేపీ నాయ‌కులు
 
ఇక ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ టీడీపీ అధికార ప్ర‌తినిధి మ‌మ్మ‌ల్ని గుడ్డ‌లు విప్పి కొడ‌తాం అంటున్నారు.. వార్తా ఛానల్స్‌ చర్చా వేదికల్లో టీడీపీ వాళ్లు ఆ తీరుగా మాట్లాడటాన్ని ఏమంటారు? అమిత్‌ షా ఫోన్‌ చేస్తే భయపడి ఫోన్‌ చేశారు అంటున్నారు. ప్రత్యేక హోదా పొడిగించలేదని బీజేపీ ఎంపీ హరిబాబు చెప్పారు. కేంద్ర పార్టీ కూడా స్పష్టం చేసింది. పవన్‌ కల్యాణ్‌ లాంటి కమిటీలు చాలా ఉంటాయి. అని అన్నారు ఎమ్మెల్సీ సోమువీర్రాజు....
 
నేను వార్డ్‌ మెంబర్‌గా పోటీ చేయలేదు. నన్ను ఎన్నో మాటలు అంటున్నారు. ఎన్నికల్లో ఓడినా 40ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నాకు నోటు లేదు..ఓటు లేదు. నా అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. నాకు భిక్షగా వేసిన ఎమ్మెల్సీ వల్ల ఒరిగేది ఏమీలేదు. ఎప్పుడైనా వదులుకుంటా అని స్పష్టం చేశారు.. అయితే తెలుగుదేశం నాయ‌కులు కావాల‌నే బీజేపీని సెంట‌ర్ చేస్తున్నారు అని అంటున్నారు బీజేపీ నాయ‌కులు... ఏపికి ఎన్ని నిధులు ఇచ్చినా వాటిని ఖ‌ర్చుచేసి లెక్క‌లు అడిగితే ఎందుకు ఇంత తిప్ప‌లు అని ఫైర్ అవుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.