చంద్ర‌బాబు అడిగితే ఏది ఇవ్వ‌ము

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-29 16:42:37

చంద్ర‌బాబు అడిగితే ఏది ఇవ్వ‌ము

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు మీడియా స‌మ‌మావేశం ఏర్పాటు చేసి మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన రైల్వే జోన్, క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీల విష‌యంలో కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని సోము వీర్రాజు స్ప‌ష్టం చేశారు. అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వీటిని అడిగితే మాత్రం తాము  ఇవ్వ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 
కేంద్రంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాలు పొత్తు పెట్టుకున్న‌ప్పుడు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను ఒక్క‌సారి కూడా చ‌ర్చించ‌లేద‌ని సోమువీర్రాజు గుర్తు చేశారు. ఇక ఇప్పుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తుణంలో ముఖ్య‌మంత్రి టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ నాయుడుతో ప్ర‌జ‌ల వ‌ద్ద సానుభూతి పొందేందుకు నిరాహార దీక్ష‌లు చేయిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
అయితే నిరాహార‌ దీక్ష చేసేముందు క‌డ‌ప‌లో మూత ప‌డిన ఫ్యాక్ట‌రీల‌ను ఎందుకు తెరిపించలేక పోతున్నారో త‌మ‌కు స‌మాధానం చెప్పాల‌ని సీఎం ర‌మేష్ ను సోము వీర్రాజు ప్ర‌శ్నించారు. కేవ‌లం త‌న స్వ‌లాభం కోసం ఫ్యాక్ట‌రీల‌ను తెరిపించ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కుల‌పై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. అలాగే కేంద్ర‌మాజీ మంత్రి సుజనా చౌదరి తెర వెనక్కి ఎందుకు వెళ్లారో చంద్రబాబు చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.