సోమువీర్రాజు ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-12 14:49:09

సోమువీర్రాజు ఫైర్

తిరుమ‌ల అలిపిరి వ‌ద్ద బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా వాహ‌నం పై రాళ్లదాడి జ‌ర‌గ‌డంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. అమిత్ షా ఓ జాతీయ పార్టీ అధ్య‌క్షుడు ఆయ‌న పై దాడి జ‌రిగితే ఆ దాడి చేసిన వారిపై కేసు పెట్ట‌రా అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా లేదా అని ఆయ‌న మండిప‌డ్డారు.చంద్ర‌బాబుకు నిజాయ‌తీ ఉంటే క‌చ్చితంగా అమిత్ షా కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని ఆయ‌న అన్నారు.. తిరుపతి ఎస్పీని సస్పెండ్‌ చేసి, దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 
చంద్ర‌బాబు మొద‌టి నుంచి డ‌బుల్ స్టాండ్ తీసుకున్నారు అని మండిప‌డ్డారు ఆయ‌న‌. ఇక నాలుగేళ్లు మాతో క‌లిసే ఉన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ హీరో శివాజీని బీజేపీని ఎగ‌దోశారు. ఇక అశోక్ బాబును చ‌లసానిని తెర‌పైకి తీసుకువ‌స్తున్నారు.ప‌రిపాల‌న ప‌క్క‌న పెట్టి తెలుగుదేశం పార్టీ కేవ‌లం రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తోంది అని విమ‌ర్శించారు ఆయ‌న‌.
 
40 ఏళ్ల రాజకీయ జీవితమనే చంద్రబాబు డబుల్‌ స్టాండర్డ్స్‌పై ప్రజల్లో చర్చ జరగాలి. 2004లో మోదీని తిట్టిన ఆయన 2014లో బీజేపీతో పొత్తుకు వెంపర్లాడారు. ఇప్పుడేమో బీజేపీకి ఒక్క సీటు కూడా రావద్దని అంటున్నారు. ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో 1200 హామీలిచ్చారు. ఒక్క‌టి కూడా ప్ర‌జ‌ల‌కోసం తీర్చ‌లేదు అని విమ‌ర్శించారు ఆయ‌న‌.. గ‌తంలో ప్ర‌త్యేక‌హూదా కంటే ప్యాకేజీ గొప్ప‌ది అని తెలియ‌చేశారు.
 
మొత్తానికి ఏపీలో అభివృద్ది పేరిటి వేల కోట్లు అవినీతికి పాల్ప‌డ్డారు అని ఆయ‌న విమ‌ర్శించారు. ఏపీలో బీజేపీకి ఒక్క‌సీటు కూడా రాకూడ‌దు అని అన‌డం, మీ రూట్ ఏమిటి అని ఫైర్ అయ్యారు ఆయ‌న‌.. జ‌పాన్ త‌ర‌హ ఉద్య‌మం అంటున్నారు అస‌లు మ‌న దేశంలో ఎలాంటి ఉద్యమాలు జ‌రిగాయో తెలుసా అని ప్రశ్నించారు ఆయ‌న‌.. ప్ర‌జ‌లు అంతా దీనిని గ‌మ‌నించాలి అని ఆయ‌న అన్నారు. నిజంగా సైకిల్ యాత్ర  ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకోవాలి అని ఆయ‌న అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.