చంద్ర‌బాబుపై సోమువీర్రాజు ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-07 18:51:51

చంద్ర‌బాబుపై సోమువీర్రాజు ఫైర్

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అవినీతి పరిపాల‌న కొన‌సాగుతోంద‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై అలాగే టీడీపీ మంత్రుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో స‌మ‌ర్థ‌వంత‌మైన అవినీతి పాల‌న సాగుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. బీజేపీ స‌ర్కార్ ఏపీకీ  7 వేల ఇళ్ల‌ను కేటాయించింద‌ని అందులో 4 వేల ఇళ్ల‌కు 14 వంద‌ల కోట్ల‌ను కేటాయించామ‌ని సోము వీర్రాజు తెలిపారు.  
 
దీంతోపాటు టీడీపీ స‌ర్కార్ నాయ‌కులు ప్ర‌వేశ‌పెట్టిన నీరు చెట్టు ప‌థ‌కంలో విచ్చ‌ల‌విడిగా అవినీతి జ‌రిగిందని ఆయ‌న మండిప‌డ్డారు. ఆ ప‌థ‌కం కేవ‌లం చెరువులో ఉన్న‌ మ‌ట్టిని త‌వ్వ‌డానికి మాత్ర‌మే ప్రవేశ పెట్టార‌ని ఆరోపించారు. ఈ మ‌ట్టిని త‌వ్వ‌డానికి టీడీపీ నాయ‌కులు 13 వేల కోట్ల‌ను ఖ‌ర్చు చేశార‌ని సోమువీర్రాజు మండిప‌డ్డారు. 
 
అయితే ఈ డ‌బ్బుతో పోల‌వ‌రానికి ఖ‌ర్చు చేసుంటే పూర్తి అయ్యేది క‌దా అని ప్ర‌శ్నించారు. అలాగే జ‌న్మ‌భూమి క‌మిటీలోను కూడా టీడీపీ నాయ‌కులు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు. సాధ‌ర‌ణ వ్య‌తికి బ్యాంకుల్లోను ఇచ్చినా, ఇళ్లు ఇప్పించిన ఆవాట‌న్నింట‌కి టీడీపీ నాయ‌కులు క‌మిష‌న్ల రూప‌ల్లో ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి వ‌సూలు చేస్తున్నార‌ని సోము వీర్రాజు మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఎంత మేర‌కు వారు అవినీతికి పాల్ప‌డ్డారో త