సోము వీర్రాజు రాజీనామా...?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-15 14:54:13

సోము వీర్రాజు రాజీనామా...?

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాల పై అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌ను విమ‌ర్శిస్తూ, కొద్ది కాలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ నుంచి రాజ‌కీయంగా దూకుడును వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు.
 
ఎవ‌రైనా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీని కానీ, అలాగే బీజేపీ నాయ‌కులు అమిత్ షా ని విమ‌ర్శిస్తే వారిపై త‌న‌ధైన శైలిలో  కౌంట‌ర్ ఇస్తూ బీజేపీ త‌ర‌పున ఏపీలో యాక్టీవ్ గా ఉన్నారు సోము వీర్రాజు. ఇక ఆయ‌న దూకుడును చూసి బీజేపీ అధిష్టానం ఆయ‌న‌కు ఏపీ బీజేపీ ప‌గ్గాల‌ను అప్ప‌గిస్తాద‌ని అంద‌రు భావించారు. కానీ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా అధిష్టానం ఏపీ బీజేపీ ప‌గ్గాల‌ను క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అప్పాగించింది.
 
దీంతో సోము వీర్రాజు త‌న‌కు అధ్య‌క్ష‌ప‌ద‌విని కేటాయించ‌క‌పోవ‌డంతో కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన సంగ‌తి తెలిసందే.  ఇక తాజాగా ఆయ‌న అజ్ఞాతం నుంచి ఎట్ట‌కేల‌కు బ‌య‌టకు వ‌చ్చారు.  ఆయ‌న అజ్ఞాతం నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో పదవుల భర్తీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ఈ మేర‌కు సోము వీర్రాజు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
 
ఈ ప్ర‌క‌ట‌న ద్వారా ఆయ‌న పేర్కొంటు, అధిష్టానం కేటాయించిన ప‌ద‌వుల‌ను ప్ర‌తీ ఇక్క‌రు స‌మ‌ర్థించాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పార్టీ పెద్దలు అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని, వారి నిర్ణ‌యాన్ని పార్టీ కార్య‌క‌ర్తులు, నాయ‌కులు ఎవ్వ‌రూ వ్య‌తిరేకించ‌వ‌ద్ద‌ని సోము వీర్రాజు ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపారు.
 
ఇక మ‌రోవైపు  సోమువీర్రాజు అనుచ‌రులు అధ్య‌క్ష‌ప‌ద‌విని కేటాయించ‌క‌పోవ‌డంపై రాజీనామాలకు సిద్ధమని సోము వర్గం నేతలు పునరాలోచనలో పడ్డారు. ఒక వేల ఆయ‌న పార్టీ నేత‌ల కోరిక మేర‌కు రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి చేరుతారు అనే అంశం పై మ‌రికొంద‌రు చ‌ర్చించికుంటున్నారు. 
 
ఇక‌ ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కేంద్రంతో మిత్ర‌ప‌క్షానికి క‌టిఫ్ చెప్పడంతో సోము వీర్రాజు టీడీపీ లోకి క‌చ్చితంగా వెళ్ల‌ర‌ని విశ్లేష‌క‌లు భావిస్తున్నారు. ఇక మిగిలిన పార్టీ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో చేరేందుకు ఎక్కుగా అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.