సోము వీర్రాజు సూటి ప్ర‌శ్న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-17 03:38:16

సోము వీర్రాజు సూటి ప్ర‌శ్న

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం అంద‌రికి తెలిసిందే. దీంతో   కేంద్ర‌ప్ర‌భుత్వం పై రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు మూకుమ్మడిగా పోరాటం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ, ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ ఎంపీలు, రాష్ట్రానికి జ‌రిగిన న‌ష్టాన్ని భ‌ర్తీ చేయాలంటూ  పార్ల‌మెంట్ వేదిక‌గా గ‌ళం విప్పారు.
 
దీనిపై మ‌రోసారి స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు....రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి  కేంద్ర ప్రభుత్వం  ఇచ్చిన రూ.1600 కోట్లను విడుద‌ల చేసింద‌ని అని అన్నారు. ఆ నిధుల‌న్నీ ఏం చేశార‌ని ఆయ‌న టీడీపీ స‌ర్కార్ ను నిల‌దీశారు. బాధ్య‌తాయుతంగా ఖ‌ర్చు చేయాల్సిన నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి కేంద్రం పై నిందలు వేయ‌డం స‌రికాద‌ని అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్ర‌త్యేకంగా  చూసిన కేంద్రం... అనేక రాయితీల‌ను క‌ల్పించిందని గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన రాయితీలతో వెనుకబడిన జిల్లాల్లో ఎన్ని కంపెనీలు స్థాపించారని వీర్రాజు ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్నా....వాటిని ఉప‌యోగించుకోవ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌లం అయింద‌ని మండిప‌డ్డారు.
 
నిజాల‌ను నిగ్గు తేల్చ‌డానికి జేఎఫ్‌సి పేరుతో పోరాటానికి సిద్దం అయిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేసిందో అడుగుతాన‌ని వీర్రాజు పేర్కొన్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌  త‌రుణంలో రాజ‌కీయ ల‌బ్ది కోసమే రాజీనామా డ్రామాల‌కు తెరలేపార‌ని సోమువీర్రాజు అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.